|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాశి ఖన్నా బాంబ్: ‘తెలుసు కదా’ రిజల్ట్ ముందే లీక్ చేసిందా? టాలీవుడ్‌లో దుమారం!

Published: 14-03-2026, 4:45 AM
రాశి ఖన్నా బాంబ్: 'తెలుసు కదా' రిజల్ట్ ముందే లీక్ చేసిందా? టాలీవుడ్‌లో దుమారం!
  • రాశి ఖన్నా సంచలన వ్యాఖ్యలు: ‘తెలుసు కదా’ సినిమా ఫలితం ముందే ఊహించానన్న రాశి!
  • సినిమా షూటింగ్ జరుగుతుండగానే ప్లాప్ అవుతుందని తెలుసని చెప్పిన రాశి ఖన్నా.
  • దర్శకురాలు నీరజ కోన విజన్ మీద నమ్మకంతోనే సినిమా చేశామన్న రాశి ఖన్నా.
  • పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ప్రమోషన్స్‌లో రాశి ఖన్నా కామెంట్స్ వైరల్.

టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా చేసిన తాజా వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘తెలుసు కదా’ సినిమా గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు రాశి ఖన్నా ఏం మాట్లాడింది?

‘తెలుసు కదా’ సినిమాపై రాశి ఖన్నా షాకింగ్ కామెంట్స్

Rashi Khanna: సినిమా ఇండస్ట్రీలో ఒక చిత్రం విడుదలైన తర్వాత ఫలితం ఎలా ఉన్నా, నటీనటులు సాధారణంగా తమ సినిమాను వెనకేసుకొస్తుంటారు. కానీ, టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశి ఖన్నా మాత్రం తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ అమ్మడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా షూటింగ్ లోనే రిజల్ట్ తెలిసిపోయిందన్న రాశి

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రాశి ఖన్నా(Rashi Khanna) తన గత చిత్రం తెలుసు కదా సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకురాలు నీరజ కోన తెరకెక్కించారు. ఈ సినిమా ఫలితం గురించి రాశి ఖన్నా మాట్లాడుతూ.. “తెలుసు కదా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో నాకు అర్థమైపోయింది.

పవన్ కళ్యాణ్ మూవీ ప్రమోషన్స్‌లో అసలు నిజం బయటపెట్టిన రాశి ఖన్నా

కథలోని కొన్ని పాయింట్లు ప్రేక్షకులకు కనెక్ట్ కావని నాకు అనిపించింది. ఇదే విషయాన్ని నేను చిత్ర యూనిట్‌ చాలాసార్లు చెప్పాను. కానీ, నీరజ కోన విజన్ మీద నమ్మకంతో అలాగే ముందుకు వెళ్ళాము. ఒక నటిగా నేను నా బాధ్యతను పూర్తి చేయాలి కాబట్టి, డైరెక్టర్ చెప్పినట్టు చేసుకుంటూ వెళ్లిపోయాను” అంటూ తన మనసులోని మాటను చెప్పేసింది. దీంతో, రాశి ఖన్నా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాశి ఖన్నా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె నిజాయితీని కొందరు మెచ్చుకుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.