|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ మూవీ ఓటీటీలోకి రాగానే రష్మిక అసభ్యకరమైన డీప్ ఫేక్ ఫోటోలు వైరల్..అలాంటి వారిని వదలకూడదు అంటూ నటి ఫైర్

Updated: 03-12-2025, 11:37 AM
ఆ మూవీ ఓటీటీలోకి రాగానే రష్మిక అసభ్యకరమైన డీప్ ఫేక్ ఫోటోలు వైరల్..అలాంటి వారిని వదలకూడదు అంటూ నటి ఫైర్
  • రష్మిక నటించిన ‘థామ’ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయిన వెంటనే డీప్‌ఫేక్ ఫోటోలు వైరల్ అయ్యాయి.
  • కొందరు ఏఐని దుర్వినియోగం చేసి రష్మిక అసభ్యకరమైన ఫోటోలను సృష్టించారు.
  • మహిళలను టార్గెట్ చేసే వారిని కఠినంగా శిక్షించాలని రష్మిక మందన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
  • ఏఐని ప్రగతికి ఉపయోగించుకోవాలి కానీ అసభ్యకరమైన పనులకు కాదని రష్మిక స్పష్టం చేసింది.

పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న ఇటీవల డీప్‌ఫేక్ ఫోటోల బాధితురాలిగా మారింది. ఆమె నటించిన ‘థామ’ చిత్రం ఓటీటీలో విడుదలైన వెంటనే అసభ్యకరమైన ఏఐ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీనిపై రష్మిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఏఐ దుర్వినియోగాన్ని ఖండించింది.

రష్మిక డీప్‌ఫేక్ ఫోటోల వైరల్

రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ హీరోయిన్స్ లో ఒకరు. ఇటీవల ఆమెకి యానిమల్, పుష్ప 2 లాంటి భారీ విజయాలు దక్కాయి. రష్మిక లాంటి స్టార్ హీరోయిన్లని ఇటీవల కొందరు డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు.. ఏఐ జెనెరేటెడ్ అసభ్యకరమైన ఫొటోలతో టార్గెట్ చేస్తున్నారు. చాలా మంది నటీమణులు ఏఐ బారిన పడిన సంగతి తెలిసిందే.

చాలా మంది నటీమణులు ఇప్పటికే ఏఐ ని అసభ్యకరమైన పనులకు ఉపయోగించడంపై గళం విప్పారు. తాజాగా రష్మిక మందన్న తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోసింది. ఇటీవల ఆమె నటించిన థామ చిత్రం ఓటీటీలో విడుదలయింది. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీనితో రష్మిక ఫోటోలని ఏఐతో కొందరు అసభ్యంగా తయారు చేశారు.

దీనితో రష్మిక ఏఐ ని ఇలా దుర్వినియోగం చేస్తూ మహిళలని టార్గెట్ చేయడం పై ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నిజాన్ని మార్చే ఈ రోజుల్లో.. ఏది నిజమో ఏది అబద్దంతో తెలుసుకోవగలగడమే మనకు రక్షణ. ఏఐ అనేది మన ప్రగతికి దోహదపడాలి. కానీ దానిని అసభ్యకరమైన పనులకు వాడడం, మహిళల్ని కించపరిచేందుకు ఉపయోగించడం అనేది దిగజారుడు తనానికి సూచన.

ఏఐ దుర్వినియోగంపై రష్మిక ఆగ్రహం

ఇంటర్నెట్ అనేది ఇకపై నిజానికి అద్దం లాంటిది కాదు. ఏదైనా సృష్టించగలిగే కాన్వాస్ గా మారిపోయింది. మనమంతా ఏఐని దుర్వినియోగం చేయకుండా ప్రగతికి ఉపయోగించుకోవాలి. ఆ విధంగా మన చర్యలు ఉండాలి. మనుషుల్లాగా ప్రవర్తించని వారిని కఠినంగా శిక్షించాలి అంటూ రష్మిక పోస్ట్ చేసింది.

మొత్తంగా రష్మిక ట్వీట్ తో మరోసారి ఏఐ పై చర్చ జరుగుతోంది. రష్మిక చివరగా ది ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఆమె థామ అనే చిత్రంలో నటించింది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

మహిళల టార్గెట్‌పై నటి ఆవేదన

“When truth can be manufactured, discernment becomes our greatest defence.” AI is a force for progress, but its misuse to create vulgarity and target women signals a deep moral decline in certain people. Remember, the internet is no longer a mirror of truth. It is a canvas where…

— Rashmika Mandanna (@iamRashmika) December 3, 2025

రష్మిక మందన్న డీప్‌ఫేక్ వివాదం ఏఐ దుర్వినియోగంపై మరోసారి చర్చకు దారితీసింది. మహిళల గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి చర్యలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.