
📌 Key Points
- రష్మిక మందన్న 30వ పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకున్నారు.
- తండ్రి మదన్ మందన్న కూతురికి ఖరీదైన బంగ్లాను బహుమతిగా ఇచ్చారు.
- ఈ బంగ్లాకు ‘సెరినిటీ’ అని పేరు పెట్టారు, రష్మిక ఎమోషనల్ అయ్యారు.
- రష్మిక ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన 30వ పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె తండ్రి మదన్ మందన్న ఖరీదైన బంగ్లాను బహుమతిగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు.
రష్మిక 30వ పుట్టినరోజు వేడుకలు
Rashmika Manadanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతిరోజు వార్తల్లో హైలెట్గా నిలుస్తూ వస్తుంది.. రీసెంట్ గా ఆమె తన 30వ బర్త్ డే ను చాలా గ్రాండ్ గా జరుపుకుంది. ఈ పుట్టినరోజు ఆమె కెరీర్ లో స్పెషల్ గా నిలిచింది. తన తండ్రి మదన్ మందన్న ఒక అద్భుతమైన సర్ ప్రైజ్ ఇచ్చారు. కూతురిపై ఉన్న మమకారంతో అతడు ఒక అత్యంత ఖరీదైన విలాసవంతమైన బంగ్లాను గిఫ్ట్ గా రష్మికకు గిఫ్ట్ గా ఇచ్చారు. నేషనల్ క్రష్ గా ఈమె ఎన్నో హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తుంపును తెచ్చుకుంది.. అలాంటి క్రేజీ హీరోయిన్ కు తన తండ్రి ఇచ్చిన ఈ గిఫ్ట్ ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. మరి ఆ స్పెషల్ ఇల్లు ప్రత్యేకతలు, ఎన్ని కోట్లు ఉంటుందో ఒకసారి చూసేద్దాం..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ఈ ఏడాది తన 30 పుట్టినరోజు చాలా ప్రత్యేకంగా నిలిచింది.. తన 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆమెకు తన తండ్రి మదన్ ఒక అద్భుతమైన సర్ఫ్రైజ్ ఇచ్చాడు. తన కూతురు పైన ప్రేమతో ఆయన అత్యంత విలాసవంతమైన ఖరీదైన ఒక బంగ్లాని ఆమెకు సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ కొత్త నివాసానికి ఆయన `సెరినిటీ` అని పేరు పెట్టడం విశేషం. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ఈ పేరుతో ఉన్న బంగ్లాను చూసి రష్మిక ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. తన పెళ్లి చూపిస్తున్న ఈ ప్రేమే తనని ఈ స్థాయిలో నిలబెట్టింది అని రష్మిక భావోద్వేగానికి లోనైంది. ఆ బంగ్లాలో అన్ని సౌఖర్యాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆ బంగ్లా ఖరీదు కూడా కాస్త ఎక్కువే అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ బంగ్లా ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మిక. ఆ పిక్స్ కాస్త వైరల్ అవుతున్నాయి..
తండ్రి ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వివాహబంధంలోకి అడుగుపెట్టింది. దాంతో పాటుగా ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా మారింది. పుష్ప, పుష్ప 2, యానిమల్ వంటి భారీ చిత్రాలతో పాన్ ఇండియా విజయాల్ని తన సొంతం చేసుకుంది. ఈమె ఏడాది నటించిన గర్ల్ ఫ్రెండ్, థామా రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టుగా నిలిచాయి. ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా ప్రాజెక్ట్లు చేసినందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. కేవలం తెలుగు బాలీవుడ్ మాత్రమే కాదు అటు తమిళంలో కూడా ఈమె ఎన్నో సినిమాలు చేసి అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఒకవైపు తన ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూనే మరోవైపు తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉంది.. ఇక తెలుగులో మరో రెండు సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఆ ప్రాజెక్టుల గురించి ప్రకటించే అవకాశం ఉంది. అటు విజయ్ దేవరకొండ కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. రౌడీ జనార్ధన్ తో పాటుగా.. రణబాలి చిత్రంలో కూడా నటిస్తున్నాడు..
‘సెరినిటీ’ బంగ్లా ప్రత్యేకతలు
Tags father gift Rashmika Mandanna tollywood movies Vijay Devarakonda Share
మొత్తానికి రష్మిక మందన్న పుట్టినరోజు ఆమెకు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. తండ్రి ఇచ్చిన బహుమతి ఆమె కెరీర్ లో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పవచ్చు.


