|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ న్యూస్: నానిని అన్నయ్య అని పిలుస్తోన్న రష్మిక! అసలు నిజం తెలిస్తే షాక్!

Published: 13-03-2026, 10:05 PM
షాకింగ్ న్యూస్: నానిని అన్నయ్య అని పిలుస్తోన్న రష్మిక! అసలు నిజం తెలిస్తే షాక్!
  • రష్మిక, నానిల ‘దేవదాస్’ మూవీ సీన్స్ వైరల్! ఇద్దరి మధ్య స్నేహబంధం వెనుక అసలు కథ?
  • నానిని అన్నయ్య అని పిలుస్తోన్న రష్మిక మందన్న! టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
  • విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి తర్వాత నానితో బంధంపై ఫిల్మ్ నగర్లో చర్చలు!
  • రష్మిక, నాని బంధంపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు, నిజమెంత?

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. ఆమె ఒక స్టార్ హీరోను అన్నయ్య అని పిలుస్తోందట. ఇంతకీ ఆ హీరో ఎవరు? అసలు ఈ వార్తల్లో నిజమెంత? చూద్దాం!

రష్మిక, నానిల మధ్య ‘దేవదాస్’ స్నేహం!

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు మంచి కాంబినేషన్లు చాలా మంది ఉన్నారు. కొంత మంది మాత్రమే వారి బాండింగ్ ను ఎక్కువగా పెంచుకుంటుంటారు. అందులో కొంత మంది ప్రేమికులుగా మారి పెళ్లిల్లు చేసుకున్నారు. మరికొందరు మాత్రం అన్నా చెల్లెళ్ల బంధం కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా తన కో స్టార్ విజయ్ దేవరకొండను ప్రేమించి రీసెంట్ గా పెళ్లి చేసుకుంది. అయితే ఆమె ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోను అన్నయ్య అని పిస్తుందట. ఇంతకీ ఆయన ఎవరంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు పొందడం సులభం కాదు. చాలా మంది హీరోయిన్లు మంచి అవకాశాలు అందుకుని తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించినప్పటికీ, కొద్ది కాలానికే ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే మరికొందరు తారలు మాత్రం కొన్నేళ్లపాటు తమ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అలాంటి వారిలో రష్మిక మందన్న కూడా ఒకరు.

అన్నయ్య అని పిలుస్తోన్న నేషనల్ క్రష్!

ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. గీతా గోవిందం’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు పొందిన రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా కొనసాగుతున్నారు. అంతే కాదు వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన రష్మిక.. కెరీర్‌ను మరింత బలోపేతం చేసుకుంటూ వెళ్తోంది. రష్మిక మందన్న టాలీవుడ్ లో మాత్రమే కాదు.. బాలీవుడ్ లో కూడా వరుస విజయాలతో దూసుకుపోతోంది. అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా మారింది. అందుకే ఆమెకు నేషనల్ క్రష్ అన్న పేరు కూడా వచ్చింది.

ఇప్పటికే రష్మికకు భారీ స్థాయిలో అభిమానులు ఉండగా.. ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ఆమెకు స్నేహితులుగా మారారు. అయితే ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోను రష్మిక మందన్న తనకు బ్రదర్‌లా భావిస్తుందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ హీరో మరెవరో కాదు నేచురల్ స్టార్ నాని. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ ప్రచారం జరుగుతోంది. రష్మిక – నాని కలిసి ‘దేవ దాస్’ సినిమాలో నటించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్తలు!

ఆ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడిందని చెబుతున్నారు. అప్పటి నుంచి నాని , రష్మిక మధ్య మంచి ఫ్రెండ్షిప్ కొనసాగుతోందని సమాచారం. అంతేకాకుండా నానిని ఆమె ఒక మంచి స్నేహితుడిగా మాత్రమే కాకుండా బ్రదర్‌లా భావిస్తుందని కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండకు కూడా నాని మంచి స్నేహితుడు. విజయ్ కెరీర్ బిగినింగ్ లో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో.. విజయ్ నాని కలిసి నటించారు.

రష్మిక, నానిల బంధంపై వస్తున్న ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని వివరాలు తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.