
📌 Key Points
- విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి ఫిక్స్! ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
- షాహిద్ కపూర్‌తో రొమాంటిక్ మూవీకి రష్మిక నో చెప్పడానికి విజయ్ పెళ్ళే కారణమా?
- పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇవ్వనున్న రష్మిక! ఫ్యాన్స్ షాక్!
- ప్రస్తుతం రష్మిక చేతిలో కాక్ టైల్ 2, మైసా, రణబాలి చిత్రాలు ఉన్నాయి.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఒక సంచలన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండతో ఆమె పెళ్లికి సిద్ధమైందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
విజయ్, రష్మికల పెళ్లి ఫిక్స్?
Rashmika Mandanna : అన్ని పరిశ్రమలలో స్టార్ హీరోగా, నేషనల్ క్రష్ గా దూసుకుపోతుంది రష్మిక మందన్న. ఇలాంటి సమయంలో విజయ్ తో పెళ్లికి రెడీ అయి అందరికి షాక్ ఇచ్చింది రష్మిక. గీత గోవిందం సినిమాతో పరిచయం అయిన రష్మిక – విజయ్ డియర్ కామ్రేడ్ సినిమా సమయంలో ప్రేమలో పడి అప్పట్నుంచి డేటింగ్ చేస్తున్నారు. ఇటీవలే కొన్ని నెలల క్రితం సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు ఈ జంట.(Rashmika Mandanna)
రష్మిక – విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయపూర్ లోని ఓ ప్యాలెస్ లో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే రష్మిక – విజయ్ తో పెళ్లి వల్ల బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా వదులుకుందట. రష్మిక బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ హిస్ కొడుతున్న సంగతి తెలిసిందే.
షాహిద్ కపూర్ సినిమాకు రష్మిక నో చెప్పడానికి కారణం ఇదేనా?
ప్రస్తుతం రష్మిక చేతిలో కాక్ టైల్ 2, మైసా, రణబాలి సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, రష్మిక జంటగా కాక్ టైల్ 2 తెరకెక్కుతుంది. బాలీవుడ్ దర్శకుడు అమిత్ శర్మ.. రష్మిక – షాహిద్ జంటగా మరో సినిమాని ప్లాన్ చేసాడట.
రష్మికని కలిసి ఓ రొమాంటిక్ కథ చెప్పాడట. కానీ రష్మిక మాత్రం ఈ సినిమాకు నో చెప్పిందట. అందుకు విజయ్ తో పెళ్లి కారణం అని బాలీవుడ్ లో సమాచారం. పెళ్లి తర్వాత రష్మిక కొంత సమయం విజయ్ తో గడపాలని అనుకుంటుందట. అందుకే ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేసి కాస్త గ్యాప్ తీసుకొని పెళ్లి తర్వాత మళ్ళీ కొత్త సినిమాలను ఓకే చేస్తుందని సమాచారం.
పెళ్లి తర్వాత రష్మిక సినిమాలకు బ్రేక్?
అంతేకాక బాలీవుడ్ డైరెక్టర్ చెప్పిన సబ్జెక్టు రొమాంటిక్ సబ్జెక్టు కావడంతో నో చెప్పిందని బాలీవుడ్ మీడియా అంటుంది. మరి రష్మిక విజయ్ తో పెళ్లి తర్వాత ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.
రష్మిక, విజయ్ పెళ్లి వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


