|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అన్నింటికంటే బాధాకరమైన విషయం అదే.. చాలా మిస్ అవుతున్నానంటూ రష్మిక ఎమోషనల్ కామెంట్స్

Published: 07-07-2025, 3:16 AM
అన్నింటికంటే బాధాకరమైన విషయం అదే.. చాలా మిస్ అవుతున్నానంటూ రష్మిక ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్‌లో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి, తన కొత్త సినిమా ‘మైసా’ గురించి మాట్లాడింది. ఆమె ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Key Points

1

రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది.

2

ఆమె తన చెల్లిని, స్నేహితులను చాలా మిస్ అవుతోంది.

4

‘మైసా’ సినిమాలో ఆమె పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని తెలిపింది.

రష్మిక మందన్న ఎమోషనల్ ఇంటర్వ్యూ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధిస్తున్న ఈ భామ గత కొద్ది కాలంగా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇటీవల ‘కుబేర’ సినిమాతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ గర్ల్‌ఫ్రెండ్చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన్న ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘నేను వారాంతపు సెలవుల కోసం ఏడుస్తాను. నాకు ఒక చెల్లి ఉంది. ఆమె నాకంటే 16 ఏళ్లు చిన్నది. అయితే ఇప్పుడు తనకు 13ఏళ్ల వయసు ఉంటుంది.

కుటుంబం, స్నేహితులను మిస్ అవుతున్న రష్మిక

నా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి సుమారు ఎనిమిదేళ్లుగా ఆమెను నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. గతంతో పోలీస్తే ఇప్పుడు ఆ విషయంలో చాలా బాధగా ఉంది. అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఏడాదిన్నరగా మా ఇంటికి వెళ్లలేదు. నా చెల్లిని చాలా మిస్ అవుతున్నా.. నేను నా స్నేహితులను చూడలేకపోయాను. ఇంతకు ముందు వారు కనీసం ట్రిప్స్‌కి పిలిచేవారు. కానీ ఇప్పుడు వారు అలా కూడా చేయరు. మా అమ్మ ఎప్పుడూ చెప్పేది. ‘నీ వృత్తి జీవితంలో రాణించాలంటే, నీ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలి, వ్యక్తిగత జీవితాన్ని కోరుకుంటే, నీ ఉద్యోగ జీవితాన్ని త్యాగం చేయాలని అనేది.

కొత్త సినిమా ‘మైసా’ గురించి రష్మిక

కానీ నేను రెండింతలు కష్టపడి పని చేస్తానని చెప్పేదాన్ని’’ అని చెప్పుకొచ్చింది. అలాగే ఈ అమ్మడు నటిస్తున్న కొత్త సినిమా ‘మైసా’ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను ఎప్పుడూ మీకు కొత్తదనాన్ని.. భిన్నమైనదాన్ని.. ఉత్తేజకరమైన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇది అలాంటి వాటిలో ఒకటి. నేను ఇంతకు ముందు ఎప్పుడూ పోషించని పాత్రలో కనిపించబోతున్నా. ఎప్పుడూ అడుగుపెట్టని ప్రపంచంలోకి వెళ్తున్నాను. నేను చాలా భయానకంగా, చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇది ప్రారంభం మాత్రమే’’ అని ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది.

రష్మిక మందన్న తన వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను సాధించడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘మైసా’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.