|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బతకాలని కూడా లేదు అంటూ అభిమాని ఎమోషనల్, రష్మిక మందన్న ఇచ్చిన సమాధానం ఇదే

Published: 01-06-2025, 6:19 AM
బతకాలని కూడా లేదు అంటూ అభిమాని ఎమోషనల్, రష్మిక మందన్న ఇచ్చిన సమాధానం ఇదే

జీవితంలోని కష్టాలను ఎదుర్కొంటున్న అభిమానికి సోషల్ మీడియా ద్వారా రష్మిక మందన్న ఎమోషనల్‌గా సమాధానం ఇచ్చారు. ఆమె మాటలు అనేక మంది హృదయాలను తాకాయి.

Key Points

1

రష్మిక మందన్న అభిమానికి ఎమోషనల్ సమాధానం ఇచ్చారు.

2

జీవితంలోని కష్టాలను ఎలా ఎదుర్కోవాలో ఆమె సూచించారు.

4

ఆమె వృత్తి జీవితం మరియు వ్యక్తిగత జీవితం అభిమానులకు స్ఫూర్తిదాయకం.

అభిమాని యొక్క ఎమోషనల్ ప్రశ్న

స్టార్ హీరోయిన్ రష్మిక తన జీవితంలో ఎదురైన అత్యంత కఠినమైన ఇబ్బందులని ఎలా ఎదుర్కొందో  సోషల్ మీడియాలో వివరించింది. ఓ అభిమానికి రష్మిక సోషల్ మీడియాలో సమాధానం ఇస్తూ చేసిన ఎమోషనల్ కామెంట్స్ నెటిజన్ల హృదయాల్ని గెలుచుకుంటున్నాయి.

ఒక అభిమాని, “జీవితంలో ప్రతిదీ తప్పుగా జరిగే సమయంలో, కనీసం బతకాలని కూడా అనిపించకపోతే, ఎలా ఎదుర్కోవాలి? నేను విలువలేని మనిషినిగా అనిపిస్తోంది. దయచేసి సూచనలివ్వండి” అని రష్మికను అడిగారు.

దీనిపై రష్మిక, “నీకు నమ్మకంగా ఉన్న వాళ్ళ మధ్య ఉండాలి. ఈ రోజు కూడా గడిచిపోతుంది అని నమ్మాలి. అదే పనిని రేపూ, ఎల్లుండీ కొనసాగించాలి. ఆ తరువాత నీకే అర్థం అవుతుంది.. నీవు ఎదుగుతున్నావు అని, కష్టాలని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నావు అని. ఆ తర్వాత నీ శక్తిని చూసి నీకే గర్వంగా అనిపిస్తుంది” అంటూ రష్మిక ఎమోషనల్ గా అభిమానికి సమాధానం ఇచ్చింది.

రష్మిక మందన్న సమాధానం

ఆమె స్పందనపై అభిమానుల ప్రశంసల వర్షం కురిసింది. ఒకరు వ్యాఖ్యానిస్తూ, “నిన్న సమాధానం ఇచ్చినట్లైతే బాగుండేది అనిపించింది, కానీ ఇవాళ ఇచ్చినందుకు సంతోషం” అని అన్నారు. మరొకరు “మీ కుటుంబంతో సమయం గడిపితే బాగుంటుంది” అని రాశారు.

వృత్తిపరంగా చూస్తే, రష్మిక ప్రస్తుతం హారర్-కామెడీ చిత్రం ‘తామా’ కోసం నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా తో కలిసి నటిస్తున్నారు. ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2025 దీపావళికి విడుదల కానుంది.

రష్మిక యొక్క కెరీర్ మరియు వ్యక్తిగత జీవితం

ఇది కాకుండా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ మూవీలో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు.

అంతేకాకుండా, 2023లో విడుదలైన హిట్ చిత్రం ‘యానిమల్’ కు సీక్వెల్ గా రూపొందనున్న ‘అనిమల్ పార్క్’ లో కూడా ఆమె పాత్ర ఉంది. ఈ చిత్రం 2027లో విడుదల కావచ్చు.రష్మిక పర్సనల్ జీవితం, ప్రొఫెషనల్ కెరీర్ రెండూ అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. వరుస హిట్లతో పాన్ ఇండియా సెన్సేషన్ గా నిలిచిన రష్మిక.. విజయ్ దేవరకొండ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రష్మిక మందన్న సమాధానం అనేక మంది అభిమానులకు ధైర్యాన్నిచ్చింది. ఆమె సినిమా కెరీర్‌లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ సాధిస్తున్న విజయాలు ప్రేరణాదాయకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.