
📌 Key Points
- విజయ్ దేవరకొండతో సినిమా కోసం రష్మిక పేరెంట్స్‌తో గొడవ
- డియర్ కామ్రేడ్ సినిమాలో కలిసి నటించిన రష్మిక, విజయ్
- పెళ్లి తర్వాత రణబాలి సినిమాలో జంటగా రష్మిక, విజయ్
- తల్లిదండ్రులను ఎదిరించి మరీ డియర్ కామ్రేడ్ లో నటించిన రష్మిక
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రేమ వ్యవహారం గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. డియర్ కామ్రేడ్ సినిమాలో నటించేందుకు రష్మిక తన తల్లిదండ్రులతో గొడవపడ్డారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమాయణం
Rashmika Mandanna: రష్మిక మందన్న ప్రస్తుతం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈమె పాన్ ఇండియా స్థాయిలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా నటిగా కొనసాగుతున్న రష్మిక విజయ్ దేవరకొండతో ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక పెళ్లి తర్వాత వీరిద్దరికి సంబంధించి ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి.. ఇక రష్మిక విజయ్ దేవరకొండతో సినిమా చేయడం కోసం తన తల్లిదండ్రులతో ఒకానొక సమయంలో ఫైట్ చేశారని తెలుస్తోంది.
రష్మిక విజయ్ దేవరకొండ గీతగోవిందం డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో కలిసిన నటించారు. అయితే డియర్ కామ్రేడ్(Dear Comrade) సినిమాలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తో తిరిగి మళ్లీ నటించడానికి తన పేరెంట్స్ ఒప్పుకోలేదని తెలిపారు. నిజానికి ఈమె ఇండస్ట్రీలోకి వచ్చే సమయంలో తన తల్లిదండ్రులు చాలా సందేహాలను వ్యక్తపరిచారని తెలిపారు. భద్రతా దృష్ట్యా తన తల్లిదండ్రులు ఎన్నో సందేహాలు వ్యక్తపరిచారు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండతో మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకొనే అవకాశం రావడంతో తన తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత ఏర్పడిందని తెలిపారు.
డియర్ కామ్రేడ్ సినిమా కోసం పోరాటం
ఇలా ఈ సినిమా విషయంలో తన తల్లిదడ్రులను ఎదిరించి కేవలం సినిమాపై ఉన్న నమ్మకంతో తిరిగి తాను డియర్ కామ్రేడ్ సినిమాలో నటించానని రష్మిక తెలియచేశారు. ఇలా వీరిద్దరూ కలిసి మరోసారి ఈ సినిమాలో నటించడం వీరిద్దరి జీవితాలకు ఒక మైలురాయిగా నిలిచిందనే చెప్పాలి. రష్మిక విజయ్ డియర్ కామ్రేడ్ సినిమాలో నటించడంతో ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడటం, పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకోవడం జరిగింది. ఒకవేళ తల్లిదండ్రుల మాట మేరకు డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక నటించకపోయి ఉంటే విజయ్ జీవితంలోకి ఈమె వచ్చి ఉండేది కాదేమో అంటూ అభిమానులు ఈ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.
రణబాలి సినిమాలో జంటగా విజయ్ రష్మిక..
రణబాలి సినిమాలో రష్మిక, విజయ్
ఇక రష్మిక విజయ్ దేవరకొండ ఈ రెండు సినిమాల తర్వాత తిరిగి మరోసారి జంటగా ఏ సినిమాలలో నటించలేదు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకున్న అనంతరం ముచ్చటగా మూడోసారి వెండితెరపై సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం రష్మిక విజయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రణబాలి అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, ఏందయ్యా స్వామి అంటూ సాగిపోయే పాట మంచి అంచనాలను పెంచేసింది. పెళ్లి కోసం ఈ సినిమా షూటింగ్ కు కొంత గ్యాప్ తీసుకున్న రష్మిక విజయ్ తిరిగి షూటింగ్ పనులలో బిజీ కానున్నారు.
రష్మిక తన కెరీర్ ప్రారంభంలోనే తల్లిదండ్రులను ఎదిరించి సినిమాపై నమ్మకంతో తీసుకున్న నిర్ణయం ఆమె జీవితాన్ని మార్చేసింది. విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమకు డియర్ కామ్రేడ్ సినిమా వేదికైంది.


