|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘విజయ్‌’ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. నిజమే అంటూ హింట్‌ ఇచ్చిన ‘రష్మిక మందన్న’

Published: 03-05-2025, 1:13 AM
'విజయ్‌' ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. నిజమే అంటూ హింట్‌ ఇచ్చిన 'రష్మిక మందన్న'

వెండితెరపై విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న జోడి ప్రేక్షకులను అలరించింది. తాజాగా రష్మిక, విజయ్ తో కలిసి నటించే కొత్త సినిమా గురించి హింట్ ఇవ్వడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

Key Points

1

రష్మిక మందన్న విజయ్ దేవరకొండతో కలిసి మరో సినిమాలో నటించనున్నట్లు హింట్ ఇచ్చారు.

2

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వీరిద్దరూ నటించే చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా.

4

రష్మిక పాత్రకు ఈ చిత్రంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.

రష్మిక హింట్‌తో విజయ్‌ ఫ్యాన్స్‌ ఆనందం

వెండితెరపై  విజయ్‌ దేవరకొండ-రష్మికలది (Rashmika) ప్రత్యేకమైన జోడీ అని చెప్పవచ్చు. వారిద్దరు మరో సినిమాలో కలిసి నటించాలని కోరుకునే వారి సంఖ్య చాలా  ఎక్కువగా ఉంటుంది. గతంలో ‘గీత గోవిందం’తో హిట్‌ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట రెండోసారి ‘డియర్‌ కామ్రేడ్‌’తో అభిమానులను మెప్పించిన విషయం తెలిసిందే. ఈ సినిమాల తర్వాత వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ, వాటిపై వారిద్దరూ ఎలాంటి రెస్పాన్స్‌ ఇవ్వలేదు. ఈ సంగతి కాస్త పక్కన పెడితే.. మరోసారి రష్మికతో కలిసి విజయ్‌ దేవరకొండ(Vijay devarakonda) స్క్రీన్‌పై కనిపించనున్నాడని అర్థం అవుతుంది.

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో కొత్త సినిమా

విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా కొద్దిరోజుల క్రితం ఒక కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్‌ రానుంది. గతంలో ఆయన తెరకెక్కించిన టాక్సీవాలా, శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు విజయ్‌తో మరో సినిమాను ప్లాన్‌ చేశాడు. ఇందులో హీరోయిన్‌గా రష్మిక నటించనుంది. అందుకు సంబంధించిన ఒక హింట్‌ను మొదటగా మైత్రి మూవీస్‌, రాహుల్ సంకృత్యాన్ #HMMLetsee అంటూ ఎక్స్‌ పేజీలో పోస్ట్‌ చేస్తూ.. రష్మికను ట్యాగ్ చేశారు. దానికి ఆమె నిజమే గాయ్స్‌ అంటూ సమాధానం ఇచ్చింది. ఇదంతా విజయ్‌- రష్మికల సినిమా గురించే అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ,  HMMLetsee అనే దానికి అర్థమేంటి..? అన్నది మాత్రం క్లారిటీ లేదు. త్వరలోనే ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా VD14

డియర్‌ కామ్రేడ్‌ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మించారు. ఇప్పుడు మరోసారి విజయ్‌- రష్మికలతో ఒక పెద్ద ప్రాజెక్ట్‌కు ప్లాన్‌ చేశారని తెలుస్తోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు పొందిన రష్మక చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. అయినప్పటికీ ఆమె విజయ్‌తో ఉన్న స్నేహం వల్ల తేదీలు సర్ధుబాటు చేయనుందట.  VD14 అనే వర్కింగ్‌టైటిల్‌తో పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ మూవీ రానుంది. 18వ శతాబ్దంలో జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ ప్రాజెక్ట్‌ను దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ప్లాన్‌ చేశాడు.  ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు చాలా ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. అందుకే రష్మిక అయితే బాగుంటుందని ఫైనల్‌ చేశారని టాక్‌.  రష్మికతో కలిసి మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకునేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు గతంలో విజయ్‌  చెప్పిన విషయం తెలిసిందే.  ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌తో ఆయన కోరిక తీరబోతుందని అభిమానులు చెబుతున్నారు.

రష్మిక మందన్న ఇచ్చిన హింట్ తో విజయ్ దేవరకొండ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.