
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల ‘ది గర్ల్ ఫ్రెండ్’ ప్రమోషన్స్‌లో పీరియడ్స్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ కామెంట్స్ పట్ల నెటిజన్ల నుంచి విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంటోంది. ఈ విషయమై స్పందిస్తూ, ఇంటర్వ్యూలకు రావాలంటేనే భయమేస్తోందని రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది.
Key Points
రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' ప్రమోషన్స్‌లో పీరియడ్స్ వ్యాఖ్యలు వివాదాస్పదం.
నెటిజన్లు ట్రోల్స్ చేయడంతో ఇంటర్వ్యూలకు రావాలంటే భయమేస్తోందని రష్మిక ఆవేదన.
తన కామెంట్లను తప్పుగా అర్థం చేసుకున్నారని, దురుద్దేశం లేదని రష్మిక స్పష్టం చేసింది.
రష్మిక త్వరలో పాన్ ఇండియా చిత్రం 'మైసా'తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
రష్మిక వ్యాఖ్యలపై వివాదం
నేషనల్ క్రష్ రష్మిక (Rashmika Mandanna)ఇటీవల ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girlfriend) సినిమాతో ప్రేక్షకులను కన్నీరు పెట్టుకునేలా చేసింది. ఆమె నటనకు అమ్మాయిలతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు. కానీ గత కొద్ది రోజులుగా ఆమెను నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల చేసిన కామెంట్స్ కాస్త వివాదాస్పదమవ్వగా.. అమ్మడుని ఆడేసుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్ము టాక్ షోలో పాల్గొని పలు కామెంట్లు చేసింది. కానీ ఇందులో మరీ ముఖ్యంగా.. అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే ఆ బాధ వాళ్లకు తెలిసేది అని చెప్పింది. ఇక వాటిని కాస్త తప్పుగా అర్థం చేసుకున్న జనాలు ఫైర్ అవుతున్నారు.
ఇంటర్వ్యూలంటే భయమేస్తోంది: రష్మిక
మగవాళ్లు ఎంత కష్టపడుతున్నారో చూడు.. కుటుంబాన్ని మొత్తం పోషించేది మగవారే అని మండిపడుతున్నారు. అలాంటిది మగవారిని చులకనగా మాట్లాడుతావా? అని తిడుతున్నారు. తాజాగా, ఈ విషయంపై రష్మిక స్పందిస్తూ.. ‘‘నేను అందుకే ఇంటర్వ్యూలకు రాను. ఒకవేళ వస్తే ఏదో ఒకటి అడుగుతారు. ఆ ప్రశ్నలకు నేను చెప్పిన సమాధానాలను తప్పుగా అర్థం చేసుకుని నా మీద ట్రోల్స్ చేస్తారు. ఇటీవల మగవారికి పీరియడ్స్ రావాలన్న ఉద్దేశం వేరు. కానీ వాళ్లు అర్థం చేసుకున్నది వేరే. నా కామెంట్స్‌ను కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఎలాంటి దురుద్దేశం లేదు.
రష్మిక తదుపరి సినిమా: మైసా
ఇలాంటివి చూసినప్పుడు ఇంటర్వ్యూలకు రావాలంటేనే భయం వేస్తోంది’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. రష్మిక త్వరలో ‘మైసా’ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రాబోతుండగా.. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. ఇందులో రష్మిక ముఖమంతా రక్తంతో ఉండగా.. యుద్ధానికి ఓ పరికరాన్ని పట్టుకుని ఫైరింగ్ లుక్‌లో కనిపించింది. ఇక ఈ సినిమాలో గోండ్ గిరిజన మహిళగా కనిపించనున్నట్లు సమాచారం.
మొత్తంగా, రష్మిక వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఆమె ట్రోల్స్‌కు గురైంది. ఈ వివాదం కారణంగా ఇంటర్వ్యూలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న రష్మిక త్వరలో తన పాన్ ఇండియా చిత్రం ‘మైసా’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.


