
📌 Key Points
- హోమీ అదిజానీయా దర్శకత్వంలో కాక్ టెయిల్ 2 లో రష్మిక లెస్బియన్ పాత్రలో నటించనుందనే వార్తలు.
- డేంజరస్ సినిమాలో లెస్బియన్లుగా అప్సర రాణి, నైనా గంగూలీ.
- బ్రీత్ వెబ్ సిరీస్ లో లెస్బియన్ పాత్రలో నిత్యా మీనన్.
- పావ కడైగల్ వెబ్ సిరీస్ లో లెస్బియన్ గా అంజలి.
ప్రస్తుతం రష్మిక మందన్న లెస్బియన్ పాత్రలో నటించనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇంతకుముందు కూడా చాలామంది హీరోయిన్లు లెస్బియన్ పాత్రలలో నటించారు. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
రష్మిక మందన్న కొత్త ప్రయోగం
Actress Lesbian Roles: చిత్ర పరిశ్రమలో హీరోలే కాదు హీరోయిన్లు కూడా భిన్నమైన పాత్రలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగానే తమను తాము మార్చుకుంటూ తమలోని టాలెంట్ ను నిరూపించుకోవడానికి ముందడుగు వేస్తున్నారు. ఇక పాత్ర ఏదైనా సరే ఆ పాత్ర ప్రజలలో ప్రభావితం చేస్తుంది అంటే.. నటించడానికి ఎంత కష్టమైనా సరే తాము సిద్ధమని నిరూపిస్తున్నారు. అలాంటి వారిలో రష్మిక మందన్న (Rashmika mandanna) కూడా ఒకరు. ఒకవైపు నటిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే.. మరొకవైపు విభిన్నమైన పాత్రలతో అభిమానులకు చేరువ అవుతోంది. అలాంటి ఈమె తొలిసారి తన కెరియర్ లో ఒక కొత్త ప్రయోగం చేయబోతోంది. లెస్బియన్ గా ఒక అడుగు ముందుకేసి అందర్నీ ఆశ్చర్యపరచడానికి సిద్ధమయ్యింది.
విషయంలోకి వెళ్తే.. హోమీ అదిజానీయా దర్శకత్వంలో రాబోతున్న కాక్ టెయిల్ 2 సినిమాలో రష్మిక మందన్న కృతి సనన్ తో కలిసి లెస్బియన్ జంటగా కనిపించబోతున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి . 2012లో వచ్చిన కాక్ టెయిల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే .. ఈ సీక్వెల్ మాత్రం స్వలింగ సంపర్కం నేపథ్యంలో సాగే విభిన్నమైన కథ అనే ప్రచారం జరుగుతోంది. ఇందులో షాహిద్ కపూర్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే ఒకవైపు ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి రష్మిక మందన్న పై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తుంటే.. మరొకవైపు ఇప్పటివరకు ఇలా ఫిలిం ఇండస్ట్రీలో లెస్బియన్ క్యారెక్టర్లు పోషించిన హీరోయిన్స్ ఎవరు అనే జాబితా కూడా వెతికేస్తున్నారు. అలా ఎవరెవరు ఇలా లెస్బియన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారో ఇప్పుడు చూద్దాం..
అప్సర రాణి – నైనా గంగూలీ :
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన డేంజరస్ సినిమాలో అప్సర రాణి , నైనా గంగూలీ ప్రేమికులుగా లెస్బియన్ పాత్రలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. పైగా వర్మ దర్శకత్వ కెరియర్ లో ఇలాంటి నేపథ్యంలో వచ్చిన తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం.
లెస్బియన్ పాత్రలో మెరిసిన తారలు
అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విభిన్నమైన పాత్రలతో ఆడియన్స్ హృదయాలను దోచుకుంటున్న నిత్యామీనన్ కూడా బ్రీత్ (వెబ్ సిరీస్) లో లెస్బియన్ పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగు అమ్మాయి ప్రముఖ స్టార్ హీరోయిన్ అంజలి పావ కడైగల్ అని వెబ్ సిరీస్లో లెస్బియన్ గా నటించింది. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
ఒకప్పుడు వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రెజీనా కసాండ్రా.. ప్రస్తుతం టీవీ షో లతో కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి ఈమె ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా అనే చిత్రంలో లెస్బియన్ పాత్రలో కనిపించింది.
ప్రముఖ హీరోయిన్ నందితా దాస్ షబానా అజ్మీతో కలిసి ఫైర్ చిత్రంలో లెస్బియన్ పాత్ర పోషించింది.
విమర్శలు, ప్రశంసలు
ఐ కాంట్ థింక్ స్ట్రైట్ అనే ఆంగ్ల / ఇండియన్ చిత్రంలో లెస్బియన్ గా నటించింది.
రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్ వెబ్ సిరీస్లో లెస్బియన్ పాత్ర పోషించింది.
ట్విస్టెడ్ అనే వెబ్ సిరీస్ లో వీరిద్దరూ లెస్బియన్ పాత్రలో నటించారు.
నేక్డ్ అనే వెబ్ సిరీస్ లో లెస్బియన్ పాత్ర పోషించారు.
మొత్తానికి రష్మిక లెస్బియన్ పాత్రలో నటించనుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో గతంలో ఆ పాత్రలు పోషించిన హీరోయిన్ల గురించి కూడా చర్చ జరుగుతోంది.


