|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rashmika Mandanna : ప్రభాస్ సర్ ఈ మెసేజ్ చూడాలి.. రష్మిక ట్వీట్ వైరల్..

Published: 03-11-2025, 10:54 PM
Rashmika Mandanna : ప్రభాస్ సర్ ఈ మెసేజ్ చూడాలి.. రష్మిక ట్వీట్ వైరల్..

పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న కెరీర్ పీక్స్‌లో ఉంది. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన రష్మికకు, ప్రభాస్‌తో సినిమా చేయాలని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన రష్మిక, ప్రభాస్‌తో కలిసి పనిచేయాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Key Points

1

రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది.

2

ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా నవంబర్ 7న విడుదల కానుంది.

4

త్వరలోనే ప్రభాస్‌తో కలిసి స్పెషల్‌గా పనిచేయాలని రష్మిక తన ఆకాంక్షను వ్యక్తం చేసింది.

రష్మిక మందన్న కెరీర్ హైలైట్స్

Rashmika Mandanna : పాన్ ఇండియా వైడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రష్మిక. హిందీ, తెలుగులో వరుస సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతుంది. చేతిలో దాదాపు ఓ అరడజను సినిమాలు కూడా పెట్టుకుంది. రష్మిక కెరీర్ మంచి పీక్ లో ఉంది. రష్మిక మెయిన్ లీడ్లో తెరకెక్కిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7 న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది.(Rashmika Mandanna)

రష్మిక ఆల్మోస్ట్ అందరు స్టార్ హీరోలతో అన్ని పరిశ్రమలో ఉన్న హీరోలతో నటిస్తుంది. తాజాగా ఓ ప్రభాస్ అభిమాని.. ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి పనిచేయడం కుదురుతుందా? ఇదే జరిగితే నా బాడీని థియేటర్లో కలెక్ట్ చేసుకో రష్మిక హైప్ తో పోతాను అని రష్మికకు ట్వీట్ చేసాడు.

ప్రభాస్ అభిమాని అద్భుతమైన ట్వీట్

దీనికి రష్మిక సమాధానమిస్తూ.. ఇది నాకు నచ్చింది. ప్రభాస్ సర్ ఈ మెసేజ్ చూడాలని కోరుకుంటున్నాను. మేము కలిసి త్వరలోనే స్పెషల్ గా పనిచేయాలని కోరుకుంటున్నాను అని తెలిపింది. మరి ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ – నేషనల్ క్రష్ రష్మిక ఇద్దరూ కలిసి సినిమా ఎప్పుడు చేస్తారో చూడాలి.

ప్రభాస్ తో సినిమాపై రష్మిక స్పందన

రష్మిక, ప్రభాస్ వంటి ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ కలిసి తెరపై కనిపిస్తే అది అభిమానులకు పండగే అవుతుంది. రష్మిక ఆకాంక్ష నిజమవుతుందా, వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.