
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారు. దీంతో ఆమె నటనకు ముగ్ధులైన నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్య ఆమెకు ఏకంగా డబుల్ రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Key Points
రష్మిక మందన్న 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారు.
నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్య ఆమెకు డబుల్ రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలిపారు.
'ది గర్ల్ ఫ్రెండ్' కోసం రష్మికకు దాదాపు 10 కోట్ల రెమ్యునరేషన్ అంచనా.
తెలుగులో రష్మిక 5 కోట్లు, బాలీవుడ్‌లో 8-10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు.
రష్మికకు డబుల్ రెమ్యునరేషన్ ఎందుకు?
Rashmika Mandanna : ప్రస్తుతం రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ గా అన్ని భాషల్లో దూసుకుపోతుంది. తెలుగు, హిందీలో ఎక్కువగా సినిమాలు చేసి వరుస విజయాలు సాధిస్తుంది. స్టార్ హీరోయిన్ గా రెమ్యునరేషన్ కూడా ఎక్కువే తీసుకుంటుంది. రష్మిక మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7 న రిలీజ్ కానుంది.(Rashmika Mandanna)
ఇటీవల ఈ సినిమా ఈవెంట్లో రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కథ నచ్చి రెమ్యునరేషన్ ఏమి వద్దు ఇప్పుడు సినిమా చేసాక చూసుకుందాం అని రెమ్యునరేషన్ తీసుకోకుండానే సినిమా చేసిందని నిర్మాతలు తెలిపారు. నేడు నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్య మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించారు.
ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కథ, రెమ్యునరేషన్ వివరాలు
ధీరజ్ మాట్లాడుతూ.. రష్మిక రెమ్యునరేషన్ తీసుకోకుండానే ఈ సినిమా చేసింది. కానీ ఇవ్వడం మా బాధ్యత. అందుకే సినిమా అయ్యాక డబల్ రెమ్యునరేషన్ ఇస్తున్నాము అని తెలిపారు. దీంతో రష్మిక కు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు భారీగానే రెమ్యునరేషన్ వచ్చినట్టు తెలుస్తుంది.
రష్మిక ప్రస్తుత మార్కెట్, రెమ్యునరేషన్ ఎంత?
ప్రస్తుతం భారీగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో రష్మిక ఒకరు. తెలుగులో రష్మిక 5 కోట్లు, అంతకు పైగా తీసుకుంటున్నట్టు టాక్. బాలీవుడ్ లో అయితే 8 నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. ఈ లెక్కన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు రష్మికకు దాదాపు 10 కోట్లు ఇచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు.
రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా కోసం రెమ్యునరేషన్ వద్దని చెప్పడం, నిర్మాతలు ఆమెకు డబుల్ రెమ్యునరేషన్ ఇవ్వడం ఆమె నిబద్ధతకు, స్టార్‌డమ్‌కు నిదర్శనం. ఈ పరిణామం సినిమా పట్ల ఆమెకున్న అంకితభావాన్ని తెలియజేస్తుంది.


