|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ న్యూస్: పెళ్లి రూమర్స్‌పై రష్మిక రియాక్షన్.. వైరల్ కామెంట్స్!

Published: 20-01-2026, 12:00 AM
షాకింగ్ న్యూస్: పెళ్లి రూమర్స్‌పై రష్మిక రియాక్షన్.. వైరల్ కామెంట్స్!
  • విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి ఫిబ్రవరి 26న అంటూ వైరల్ అవుతున్న వార్తలు!
  • నాలుగేళ్లుగా వస్తున్న పుకార్లపై స్పందించిన రష్మిక మందన్న.. పెళ్లిపై షాకింగ్ కామెంట్స్!
  • సరియైన సమయం వచ్చినప్పుడు పెళ్లి గురించి చెబుతానన్న రష్మిక.. అభిమానుల్లో ఉత్కంఠ!
  • టర్కీ వెకేషన్‌లో సేమ్ బ్యాక్‌గ్రౌండ్‌తో దొరికిపోయిన జంట.. మరోసారి పెళ్లి రూమర్స్!

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం రండి!

విజయ్, రష్మికల పెళ్లి వార్తల్లో నిజమెంత?

టాలీవుడ్ లవ్‌బర్డ్స్‌ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్నఈ జంట రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్‌లో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నట్లు కొన్ని రోజులుగా ఓ పుకారు నెట్టింట షికారు చేస్తుంది. అయితే డేటింగ్, ఎంగేజ్‌మెంట్, పెళ్లి రూమర్స్ పై ఈ జంట ఇప్పటివరకు స్పందించలేదు. కానీ వెకేషన్స్, పండుగలు ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుని దొరికిపోతూ ఉంటారు.

ఈ క్రమంలో రీసెంట్‌గా వీరిద్దరు టర్కీ వెళ్లినప్పుడు కూడా సేమ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫొటోలు షేర్ చేయడంతో ఈ పుకార్లు మరోసారి జోరందుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన్న తన మ్యారేజ్ రూమర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘గత నాలుగేళ్లుగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. నిజమేంటంటే సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే పెళ్లి గురించి స్పందిస్తాను. కానీ కచ్చితంగా ఆ టైమ్‌లో చెబుతాను’ అని చెప్పుకొచ్చింది. అప్పుడు యాంకర్ రష్మిక మనం ఇద్దరం మంచి ఫ్రెండ్స్ కదా చెప్పవచ్చుగా అని అంటే అప్పుడు రష్మిక ఆఫ్ కెమెరా ఏమైనా అడుగు చెప్తా బట్ ఇక్కడ చెప్పలేను అని అంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

రష్మిక మందన్న షాకింగ్ కామెంట్స్ వైరల్!

వెకేషన్‌లో దొరికిపోయిన జంట!

రష్మిక పెళ్లి గురించి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.