|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ రూమర్స్‌పై స్పందించిన రష్మిక మందన్న.. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోనంటూ షాకింగ్ కామెంట్స్

Published: 08-10-2025, 1:51 AM
ఆ రూమర్స్‌పై స్పందించిన రష్మిక మందన్న.. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోనంటూ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ రష్మిక మందన్న కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ వార్తలపై స్పందించారు. రూమర్లలో నిజం లేదని, ‘కాంతార’ ఆలస్యంగా చూడటానికి గల కారణాన్ని వివరించారు. తన వ్యక్తిగత జీవితంపై వచ్చే కామెంట్లను పట్టించుకోనని, కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని రష్మిక షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

Key Points

1

కన్నడ ఇండస్ట్రీ తనను బ్యాన్ చేసిందన్న వార్తలను రష్మిక మందన్న ఖండించారు.

2

'కాంతార' సినిమా చూడటానికి ఆలస్యం కావడంపై అసలు కారణాన్ని వివరించారు.

4

తన నటన గురించి వచ్చే విమర్శలకే ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు.

కన్నడ బ్యాన్ రూమర్స్‌పై రష్మిక స్పందన

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna)ను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసినట్లు పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గత రెండు రోజుల నుంచి ఈ వార్తలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘కాంతార: చాప్టర్1’(Kantara: Chapter 1)పై స్పందించకపోవడం వల్లే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఈ విషయంపై స్పందించింది. ‘‘నా గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నన్ను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదు. ఏ సినిమాను నేను విడుదలైన రెండు, మూడు రోజుల్లో నేను చూడలేను. ‘కాంతార: చాప్టర్1’ కూడా అంతే.. కొన్ని రోజుల తర్వాత చూసి మూవీ టీమ్‌ను అభినందిస్తూ మెసేజ్ చేశాను.

వాళ్లు నాకు ధన్యవాదాలు చెప్పారు. ఇదంతా తెలియని వారు నన్ను బ్యాన్ చేసారనే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. అందుకే తెర వెనుక ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మన వ్యక్తిగత జీవితాన్ని కెమెరా ముందుకు తీసుకురాలేం కదా. ఇది కూడా అంతే. నేను ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో చెప్పేదాన్ని కాదు. అందుకే ప్రజలు ఏమనుకున్నా పట్టించుకోను. వాళ్లు నా నటన గురించి ఏం మాట్లాడతారు అనేదే నాకు ముఖ్యంగా. నా వ్యక్తిగత జీవితంపై మాట్లాడే వాటిని పరిగణనలోకి తీసుకోను’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ప్రస్తుతం ‘థామా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ హారర్ థ్రిల్లర్‌లో ఆయుష్మాన్ ఖురానా సరసన హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రం అక్టోబర్ 21న థియేటర్స్‌లోకి రాబోతుంది.

‘కాంతార’ ఆలస్యంపై రష్మిక వివరణ

వ్యక్తిగత విమర్శలపై రష్మిక వ్యాఖ్యలు

మొత్తంగా, కన్నడ బ్యాన్ రూమర్స్‌పై రష్మిక మందన్న స్పష్టతనిచ్చారు. తన వ్యక్తిగత విషయాలపై వచ్చే విమర్శలను పట్టించుకోకుండా, నటనపైనే దృష్టి సారించాలనే ఆమె నిర్ణయం అభిమానులకు ఆకట్టుకుంది. త్వరలో ఆమె ‘థామా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.