
టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న తన కొత్త సినిమా ‘మైసా’ టైటిల్ ని అనౌన్స్ చేసింది. న్యూ లుక్ పోస్టర్ వైరల్ అవుతుండగా, రష్మిక యొక్క డిఫరెంట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Key Points
రష్మిక మందన్న కొత్త సినిమా 'మైసా' టైటిల్ అనౌన్స్మెంట్
పోస్టర్ లో రష్మిక డిఫరెంట్ లుక్, రౌద్ర రూపం
రవీంద్ర పుల్లె దర్శకత్వం, అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మాణం
రష్మిక మందన్న కొత్త అవతారం
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రష్మిక మందన్న హవా కొనసాగుతోంది. ఈ బ్యూటీ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతోంది. వరుసగా సూపర్ డూపర్ హిట్లు అందిస్తోంది. అయితే ఇప్పటివరకూ మూవీస్ లో రష్మిక ఒకెత్తు అయితే.. రాబోయే కొత్త సినిమాలో మాత్రం ఆమె అవతారం మరో రేంజ్ లో ఉండబోతోంది. రష్మిక కొత్త సినిమా పేరును సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు న్యూ లుక్ షేర్ చేసింది.
రష్మిక మందన్న తను చేయబోయే మరో కొత్త సినిమా పేరు అనౌన్స్ చేసింది. ఈ మూవీ నేమ్ ఏదో గెస్ చేసి, తనను కలిసే ఛాన్స్ పట్టేయండి అని సోషల్ మీడియాలో రష్మిక పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం (జూన్ 27) ఆమెనే సోషల్ మీడియాలో సినిమా పేరు పోస్టు చేసింది. ఆ పేరు ‘మైసా’. అవును రష్మిక కొత్త సినిమా పేరు మైసా. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ ప్రకారం మైసా అంటే అమ్మ అని అర్థం. ఓ వారియర్ మదర్ అని చెప్పొచ్చు.
‘మైసా’ సినిమా టైటిల్ రివీల్
రష్మిక మందన్న అంటే.. గీత గోవిందంలో గీత, డియర్ కామ్రేడ్ లో లిల్లీ, సరిలేరు నీకెవ్వరులో సంస్కృతి, పుష్పలో శ్రీవల్లి , యానిమల్ లో గీతాంజలి, కుబేరలో సమీర లాంటి క్యారెక్టర్లు గుర్తుకొస్తాయి. సాఫ్ట్ గా ఉంటూ అప్పుడప్పుడూ కోపం, నవ్వు, ప్రేమ, బాధ.. ఇలా డిఫరెంట్ ఎమోషన్లు చూపించేది రష్మిక. కానీ ఇప్పుడు మైసా టైటిల్ రివీల్ తో పాటు రష్మిక షేర్ చేసిన పోస్టర్ లో ఆమె లుక్ డిఫరెంట్ గా ఉంది.
ఈ లుక్ లో రష్మిక రా అండ్ రస్టిక్ గెటప్ లో ఉంది. నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించింది. ముఖంపై రక్తంతో కోపంతో చూస్తోంది రష్మిక.
పాన్ ఇండియా రిలీజ్ కు సన్నద్ధం
‘‘కొత్తది, విభిన్నమైంది, ఎక్సైటింగ్ గా ఉండేది మీకు ఇవ్వాలని నేనెప్పుడూ ప్రయత్నిస్తా. అలాంటి వాటిల్లో ఇది ఒకటి. నేనెప్పుడూ చేయని క్యారెక్టర్ ఇది. నేనెప్పుడూ అడుగుపెట్టని ప్రపంచం ఇది. నాకే తెలియని నాలోని కోణం ఇది. ఇది భయం లేనిది. ఇంటెన్స్, తీవ్రమైన రా. నేనెంతో ఒత్తిడితో అలాగే ఎగ్జైట్ మెంట్ తో ఉన్నా. మేం క్రియేట్ చేసేదాన్ని మీరు చూసేందుకు ఎంతో ఎదురు చూస్తున్నా’’ అని ఇన్ స్టాగ్రామ్ లో రష్మిక పోస్టు చేసింది.
రష్మిక లీడ్ రోల్ ప్లే చేస్తున్న మైసా మూవీని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో మూవీని రెడీ చేస్తున్నారు. ఈ మూవీని అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. రవీంద్ర పుల్లె డైరెక్టర్. మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశముంది.
రష్మిక మందన్న ‘మైసా’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నందున, అంచనాలు భారీగా ఉన్నాయి.


