|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rashmika Mandanna: అతనితో ఉన్న ఫొటో షేర్ చేసిన రష్మిక మందన్న.. నెటిజన్ల క్రేజీ కామెంట్స్

Published: 12-06-2025, 2:21 AM
Rashmika Mandanna: అతనితో ఉన్న ఫొటో షేర్ చేసిన రష్మిక మందన్న.. నెటిజన్ల క్రేజీ కామెంట్స్

‘కుబేర’ చిత్ర ప్రమోషన్ ఈవెంట్‌లో రష్మిక మందన్న పాల్గొని, నాగార్జునతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

Key Points

1

రష్మిక మందన్న 'కుబేర' చిత్ర ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొంది.

2

నాగార్జునతో ఉన్న ఫోటోను రష్మిక సోషల్ మీడియాలో పంచుకుంది.

4

రష్మిక సింపులిసిటీ, పెద్దలకు గౌరవం చూపించడం నెటిజన్లను ఆకట్టుకుంది.

‘కుబేర’ చిత్ర ప్రమోషన్ ఈవెంట్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna), రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జూన్ 20న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

ఈ క్రమంలో రీసెంట్‌‌గా కుబేర టీం చెన్నైలో ఓ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసింది. ఆ ఈవెంట్‌లో తాను చాలా ఎంజాయ్‌ చేశానని ట్వీట్ చేసింది రష్మిక. తన చిన్నతనాన్ని గడిపిన చెన్నైలో ఈ ఈవెంట్‌ జరగడం ఒకెత్తైతే.. ఈ ఈవెంట్లో కింగ్ నాగ్, ధనుష్‌తో క్యాండిడ్ మూమెంట్స్‌ను పంచుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింద‌ని పేర్కొంది. అలాగే కొన్ని పిక్స్ కూడా షేర్ చేసింది. అయితే ఓ పిక్ నెట్టింట అంద‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

నాగార్జునతో ఉన్న ఫోటో

ఆ పిక్ స్పెషాలిటీ ఏంటంటే.. కింగ్ నాగార్జున ర‌ష్మిక‌కి ఏదో చెబుతుంటే… ఆయాన కాళ్ల దగ్గర కూర్చుని రష్మిక వింటుంది. ఇంత ఎదిగిన కూడా ర‌ష్మిక సింప్లిసిటీ.. పెద్దలకు గౌరవించడం చూస్తుంటే తెగ ముచ్చటేస్తుందని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నెటిజన్ల ప్రతిస్పందన

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

రష్మిక మందన్న సరళత, పెద్దల పట్ల గౌరవం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘కుబేర’ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.