|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘జీ సినీ అవార్డ్స్ 2025 లో నా ప్రదర్శన’ అంటూ ప్రోమో పంచుకున్న రష్మిక మందన్న

Published: 04-06-2025, 6:29 AM
‘జీ సినీ అవార్డ్స్ 2025 లో నా ప్రదర్శన’ అంటూ ప్రోమో పంచుకున్న రష్మిక మందన్న

టాలీవుడ్ నటి రష్మిక మందన్న తాజాగా జీ సినీ అవార్డ్స్ 2025 కు సంబంధించిన ప్రోమో వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ప్రోమోలో ఆమె డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది.

Key Points

1

రష్మిక మందన్న జీ సినీ అవార్డ్స్ 2025 ప్రోమోను పంచుకుంది.

2

ప్రోమోలో ఆమె డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది.

4

జీ సినిమా, జీ టీవీ మరియు జీ5 లో ప్రసారం అవుతుంది.

రష్మిక మందన్న జీ సినీ అవార్డ్స్ 2025 ప్రోమో

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఏ ముహూర్తాన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందో తెలియదు కానీ.. సినీ చరిత్రలోనే చెరగని ముద్ర వేసుకుంది. అతితక్కువ సమయంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ఈ గుర్తింపు సొంతం సొంతం కావడం నిజంగా విశేషమని చెప్పుకోవచ్చు. ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటన, అందం, చిలిపితనంతో తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది.

తర్వాత వారసుడు, VNR Trio, ఆడవాళ్లు మీకు జోహార్లు,పొగరు, సుల్తాన్, సరిలేరు నీకెవ్వరు, డియర్ కామ్రేడ్, గీతా.. ఛలో, గీత గోవిందం, దేవదాస్, కిరాక్ పార్టీ..వంటి సినిమాల్లో అవకాశం కొట్టేసింది. ముఖ్యంగా పుష్ఫ రెండు భాగాల్లో సుకుమార్ దర్శకత్వం వహించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించి.. తన ప్రదర్శన కనబర్చింది. మొదటి పార్ట్‌లో ప్రియురాలిగా.. సెకండ్ భాగంలో అల్లు అర్జున్ ‌కు భార్యగా అద్భుతంగా నటించి జనాల్ని మెప్పించింది.

ప్రోమోలో రష్మిక డ్యాన్స్

అలాగే ఛావా చిత్రంతో చివరగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మహారాణి పాత్రలో నటించింది. ఆకట్టుకునే చీరకట్టు, బొట్టు విధానంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక పోస్ట్‌ పెడుతూనే ఉంటుంది. సినిమాకు సంబంధించిన విషయాలు.. లేటెస్ట్ ఫొటో షూట్లు, వెకేషన్స్ కు సంబంధించినవి అభిమానులతో పంచుకుంటుంది.

అయితే తాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జీ సినీ అవార్డ్స్ 2025 గురించి పంచుకుంది. ‘‘జీ సినీ అవార్డ్స్ 2025 లో నా ప్రదర్శన చిన్న చిన్న వీక్షణ మీ కోసం. జూన్ 7వ తేదీ సాయంత్రం 7:30 గంటలకు జీ సినిమా, జీ టీవీ అండ్ జీ5లో మారుతి సుజుకి అందించే 23వ జీ సినీ అవార్డ్స్ 2025లో నన్ను ప్రత్యక్షంగా చూడండి’’ అంటూ తను డ్యాన్స్ చేస్తోన్న వీడియో పంచుకుని రాసుకొచ్చింది.

ప్రసార వివరాలు

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

రష్మిక మందన్న అభిమానులకు ఈ ప్రోమో ద్వారా మరోసారి తన ప్రతిభను చూపించింది. జీ సినీ అవార్డ్స్‌లో ఆమె ప్రదర్శన ఎలా ఉంటుందో చూడటానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.