
📌 Key Points
- రష్మిక, విజయ్ దేవరకొండల వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరిగింది.
- మెహందీ వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రష్మిక.
- ఈ వేడుక కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన దుస్తులు ధరించారు.
- ఈ జంట త్వరలోనే సినిమా షూటింగ్‌లకు హాజరు కానున్నారు.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. ప్రస్తుతం మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
వైరల్ అవుతున్న రష్మిక, విజయ్ పెళ్లి ఫోటోలు
Rashmika Mandanna: రష్మిక మందన్న ఇటీవల తన ప్రియుడు విజయ్ దేవరకొండను ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఫిబ్రవరి 26వ తేదీ ఉదయ్ పూర్ లో చాలా ఘనంగా వివాహం జరుపుకున్నారు. ఈ వివాహపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే సంగీత్ పెళ్లి రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన విరోష్(Virosh) తాజాగా మెహందీ (Mehendi)వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు.
ఈ వేడుక కోసం స్పెషల్ గా డిజైన్ చేయించిన దుస్తులలో రష్మిక(Rashmika) విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ఎంతో చూడముచ్చటగా స్టైలిష్ లుక్ లో కనిపించారు. ఈ ఫోటోలను షేర్ చేసిన ఈమె ప్రధానం, మెహందీ ఫంక్షన్ అని ఆరోజు సాయంత్రం ఎంతో ఆహ్లాదంగా ఉంది కానీ చాలా త్వరగా వేడుక పూర్తి అయిందని తెలిపారు. ఇక ఈ స్పెషల్ ఈవెంట్ కోసం తమకు ప్రత్యేకంగా దుస్తులను డిజైన్ చేసిన తోరాని డిజైనర్స్ కు ఈమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మెహందీ వేడుకలకు సంబంధించిన వేడుకలో భాగంగా విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు, రష్మిక పేరెంట్స్ వారి కాబోయే అల్లుడు కోడలికి సాంప్రదాయపద్ధంగా ప్రధానం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రస్తుతం ఈ మెహేంది వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రష్మిక మందన్న విజయ్ దేవరకొండ తమ పెళ్లి వేడుకలలో భాగంగా తమ దుస్తులను ఎంతో ట్రెడిషనల్ గా డిజైన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి వివాహం టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్రాండ్ వెడ్డింగ్ గా జరిగిందని చెప్పాలి. ఈ వెడ్డింగ్ కోసం సుమారు 20 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ఇక వీరు పెళ్లి వేడుకలు పూర్తికావడంతో త్వరలోనే ఈ జంట సినిమా షూటింగ్ కి హాజరు కానున్నారు.
మెహందీ వేడుకలో ప్రత్యేకంగా రష్మిక, విజయ్
It was the Pradhanam and Mehendi evening. It was too perfect but it went off too fast.. ❤️
What a stunning piece you have created!!! @toraniofficial thank you for making it so special for us 🫶🏻 pic.twitter.com/czlU4qo2Ye
— Rashmika Mandanna (@iamRashmika) March 10, 2026
త్వరలో షూటింగ్‌లో పాల్గొననున్న జంట
విజయ్ దేవరకొండ రష్మిక మందన్న గీత గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలలో కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత వీరిద్దరు తిరిగి మరోసారి వెండితెరపై కనిపించలేదు. డియర్ కామ్రేడ్ తర్వాత ఈ జంట ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. ఇలా పెళ్లి బంధంతో ఒక్కటైన వీరిద్దరూ పెళ్లి తర్వాత జంటగా వెండితెరపై సందడి చేయబోతున్నారు. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ రష్మిక రణబాలి(Ranabaali) అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత వీరిద్దరూ జంటగా తెరపై కనిపించబోతున్న నేపథ్యంలో అభిమానులకు ఈ సినిమా ఎంతో స్పెషల్ గా ఉండబోతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగభాగం పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
రష్మిక, విజయ్ దేవరకొండల వివాహం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వారి మెహందీ వేడుక ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ఈ జంట వెండితెరపై సందడి చేయనున్నారు.


