|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rashmika Mandanna: విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక.. చాలా స్పెషల్ అంటూ పోస్ట్!

Published: 28-05-2025, 11:54 AM
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక.. చాలా స్పెషల్ అంటూ పోస్ట్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు విజయ్ దేవరకొండ ఇంట్లో తీయబడ్డాయని నెటిజన్లు అనుమానిస్తున్నారు. రష్మిక-విజయ్ డేటింగ్ రూమర్స్ పై కొత్త చర్చ జరుగుతోంది.

Key Points

1

రష్మిక మందన్నా తన కొత్త ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

2

ఫోటోలు విజయ్ దేవరకొండ ఇంట్లో తీయబడ్డాయని నెటిజన్లు అనుమానిస్తున్నారు.

4

ఇద్దరు 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాలలో కలిసి నటించారు.

రష్మిక మందన్నా కొత్త ఫోటోలు వైరల్

పుష్పభామ, నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. పుష్ప-2 తర్వాత వచ్చిన ఛావా మూవీతో సైతం సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ సరసన సికందర్‌లోనూ మెరిసింది. ప్రస్తుతం నాగార్జున-ధనుశ్ కీలక పాత్రలు పోషిస్తోన్న కుబేరలో కనిపించనుంది. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో టచ్‌లో ఉండే ముద్దుగుమ్మ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఎల్లో శారీలో ఉన్న పిక్స్ మరింత గ్లామరస్‌గా ఉన్నాయి. అయితే ఇవీ చూసిన నెటిజన్స్ నెట్టంట భిన్నమైన కామెంట్స ‍చేస్తున్నారు. ఆ ఫోటోలు తీసింది.. మరెవరో కాదు.. బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటోషూట్?

రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ.. “ఈ ఫోటోలన్నీ నాకు ఇష్టమైనవి. ఈ  రంగు, ప్రదేశం నాకు చీరను బహుమతిగా ఇచ్చిన అందమైన మహిళ. అంతేకాకుండా ఫోటోగ్రాఫర్.. ఈ ఫోటోలోని ప్రతిదీ నా లైఫ్‌లో భర్తీ చేయలేనివి ” అంటూ క్యాప్షన్‌ కూడా రాసుకొచ్చింది. అయితే ఈ ఫోటోల్లో ఉన్న బ్యాగ్‌ గ్రౌండ్‌ విజయ్‌ దేవరకొండ ఇంటిలాగే ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఈ ఫోటోలు కచ్చితంగా విజయ్ దేవరకొండ తీసి ఉంటారని మరొకరు రాసుకొచ్చారు.

రష్మిక-విజయ్ డేటింగ్ రూమర్స్

ఏదేమైనా గతంలో చాలాసార్లు విజయ్ ఇంట్లో ఉన్న ఫోటోలు షేర్ చేసి దొరికిపోయిన రష్మిక.. మరోసారి అలాగే నెటిజన్లకు చిక్కింది. గతేడాది దీపావళి పండుగ సమయంలోనూ రష్మిక.. విజయ్ ఇంటివద్దనే సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే గత కొన్నేళ్లుగా రష్మిక-విజయ్‌పై డేటింగ్‌ రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. వీరిద్దరు జంటగా  ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలలో నటించారు.

రష్మిక మరియు విజయ్ డేటింగ్ రూమర్స్ పై ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత లేదు. ఈ ఫోటోలు మరింత చర్చకు తెర తీస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.