|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రష్మిక కోరిక తీర్చిన టాలీవుడ్ హీరో..!

Published: 15-06-2025, 10:58 AM
రష్మిక కోరిక తీర్చిన టాలీవుడ్ హీరో..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా కోరికను అల్లు అర్జున్ నెరవేర్చాడని వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 సినిమాతో సంబంధం ఉన్న ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Key Points

1

రష్మిక మందన్నా కోరికను అల్లు అర్జున్ తీర్చాడు!

2

పుష్ప 2 సినిమాలోని ఒక సన్నివేశం ఆధారంగా ఈ వార్త వైరల్ అవుతోంది.

4

రియల్ లైఫ్ లో రష్మిక కోరిక నెరవేరినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

రష్మిక కోరిక ఏమిటి?

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా ( Rashmika Mandanna ) గురించి తెలియని వారు ఉండరు. అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా కొనసాగడమే కాకుండా… అటు బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా దున్నేస్తోంది. అవకాశం వచ్చిన ప్రతి సినిమాను సద్వినియోగం చేసుకొని.. అగ్ర హీరోయిన్గా కొనసాగుతోంది రష్మిక మందాన. అయితే అలాంటి హీరోయిన్ రష్మిక మందన్నా కోరికను హీరో అల్లు అర్జున్ (Allu Arjun) తీర్చినట్లు సోషల్ మీడియాలో కొంతమంది ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ చేస్తున్నారు.

అదేంటి అల్లు అర్జున్ కోరిక తీర్చడం ఏంటని అనుకుంటున్నారా ? ఇది రియల్ లైఫ్ లో కాదు. పుష్ప 2 సినిమాలో ( Pushpa 2) అల్లు అర్జున్ అలాగే రష్మిక మందన్నా భార్య, భర్తలుగా నటిస్తారని సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో… ముఖ్యమంత్రితో ఫోటో కావాలని అల్లు అర్జున్ ను హీరోయిన్ రష్మిక మందన్నా కోరుతుంది. దాని కోసం ఆ సినిమాలో అల్లు అర్జున్… ఎన్నో సాహసాలు చేస్తాడు. అయితే.. ఆ సినిమాలోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఏకంగా ముఖ్యమంత్రితో ఫోటో దిగి… హీరోయిన్ రష్మిక కోరిక తీర్చడానికి కామెంట్స్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ చేసిన పని ఏమిటి?

తాజాగా గద్దర్ అవార్డ్స్ ( Gaddar Awards) ఫంక్షన్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy) చేతుల మీదుగా గద్దర్ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫోటో కూడా దిగారు. ఆయన ముందే డైలాగ్ చెప్పి రచ్చ చేశారు అల్లు అర్జున్. దీంతో పుష్ప సినిమాలో రష్మిక కోరిన కోరికను.. రియల్ లైఫ్ లో అల్లు అర్జున్ తీర్చేశాడని కొన్ని వీడియోలు వైరల్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త

A post shared by 🅴🅼 🅿🅰🆁🅻🅴🅳🆄 🅴🅼 🅿🅰🆁🅻🅴🅳🆄 50k🎯 (@emparleduemparledu)

అల్లు అర్జున్ తన అభినయంతో పాటు, రియల్ లైఫ్ లోనూ రష్మిక కోరికను తీర్చడం అభిమానులను ఆకట్టుకుంటోంది. పుష్ప 2 సినిమా విడుదల తర్వాత ఈ ఘటన మరింత చర్చనీయాంశం అవుతుందని అనిపిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.