|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాక్సాఫీస్ దగ్గర రష్మిక మందన్న రచ్చ, 100 కోట్ల చేరువలో థామా సినిమా కలెక్షన్స్

Published: 28-10-2025, 10:41 AM
బాక్సాఫీస్ దగ్గర రష్మిక మందన్న రచ్చ, 100 కోట్ల చేరువలో థామా సినిమా కలెక్షన్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన బాలీవుడ్ చిత్రం ‘థామా’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉండగా, రష్మిక కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆయుష్మాన్ ఖురానాతో రష్మిక కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Key Points

1

రష్మిక మందన్న నటించిన బాలీవుడ్ చిత్రం 'థామా' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.

2

ఈ సినిమా 7 రోజుల్లో 93.03 కోట్లు వసూలు చేసి, 100 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది.

4

'థామా' మ్యాడాక్ హారర్ కామెడీ సిరీస్‌లో కొత్త వెర్షన్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

థామా: రష్మిక కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్

వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతోన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. తాజాాగా మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆయుష్మాన్ తో కలిసి జంటగా నటించిన బాలీవుడ్ మూవీ థామా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక 2023లో డ్రీమ్ గర్ల్ 2 తర్వాత ఆయుష్మాన్ నటించిన రొమాంటిక్ హారర్ కామెడీ సినిమా కావడంతో బాలీవుడ్ లో ఈసినిమా బాగా వర్కౌట్ అయ్యింది.  ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక, యఆయుష్మాన్ తో పాటుగా నవాజుద్దీన్, పరేష్ రావల్  కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు.

బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది థామా. సోమవారం, అక్టోబర్ 27, 2025న థామా హిందీ ఆక్యుపెన్సీ 8.9% ఉంది. Sacnilk ప్రకారం, 7వ రోజు ఉదయం షోలలో 6.88%, మధ్యాహ్నం షోలలో 11.01% ఆక్యుపెన్సీ నమోదైంది.

బాక్సాఫీస్ వద్ద ‘థామా’ కలెక్షన్స్ సునామీ

రష్మికతో పాటు  ఆయుష్మాన్ ఖురానాకు కూడా ఈసినిమా అద్భుతమైన విజయాన్ని అందించింది. ఆయుష్మాన్  రెండేళ్ల విరామం తర్వాత థియేటర్లలోకి తిరిగి రావడంతో అతని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.  ఈ హారర్ కామెడీ సినిమా దాదాపుగా 24 కోట్ల భారీ ఓపెనింగ్‌ను కూడా  సాధించింది.

మ్యాడాక్ హారర్ కామెడీ సిరీస్‌లో థామా కొత్త వెర్షన్. ఇది స్త్రీ, భేదియా, ముంజ్యా, స్త్రీ 2 లాంటి సినిమాల  సరసన చేరింది. ఆయుష్మాన్, రష్మికల మొదటి సినిమా  అయినా.. ఇందులో ఈ ఇద్దరు స్టార్స్  ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.

100 కోట్ల క్లబ్‌కు చేరువలో ‘థామా’

“థామా” బాక్సాఫీస్ వద్ద “ఏక్ దీవానే కీ దీవానగీ”తో పోటీ పడుతోంది. 7వ రోజున థామా అన్ని భాషల్లో కలిపి సుమారు 1.73 కోట్లు సంపాదించింది. దీని మొత్తం కలెక్షన్  93.03 కోట్లకు చేరింది. ఈరోజు ఈసినిమా 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది. ఈక్రమంలో రష్మిక ఖాతాలో మరో భారీ బ్లాక్ బస్టర్ పడ్డట్టే అని ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు.

‘థామా’ సినిమా రష్మిక, ఆయుష్మాన్‌లకు కెరీర్ బెస్ట్ విజయాన్ని అందించింది. 100 కోట్ల మైలురాయిని చేరుకుంటే, బాలీవుడ్‌లో రష్మిక స్టార్‌డమ్ మరింత పెరుగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.