
పాన్ ఇండియా స్టార్ రష్మిక మండన్న, బాలీవుడ్ నటి కృతి సనన్ జిమ్‌లో సరదాగా కలిశారు. రష్మిక నిరంతరం జిమ్‌లో ఉండటాన్ని చూసి కృతి చేసిన ఫన్నీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తోటి హీరోయిన్‌ని రష్మిక ఎలా షాకిచ్చిందో తెలుసుకోండి.
Key Points
పాన్ ఇండియా స్టార్ రష్మిక మండన్న బాలీవుడ్, టాలీవుడ్‌లో బిజీగా ఉంది.
రష్మిక, కృతి సనన్ 'కాక్ టెయిల్ 2' చిత్రంలో కలిసి నటిస్తున్నారు.
జిమ్‌లో రష్మిక వర్కౌట్స్ చూసి కృతి సనన్ ఫన్నీ కామెంట్ చేసింది.
కృతి సనన్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.
రష్మిక, కృతి సనన్ జిమ్ సరదా
పాన్ ఇండియా లెవల్లో ప్రస్తుతం బిజీ యాక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది రష్మిక మాత్రమే. ఎందుకంటే ఓవైపు ప్రాంతీయ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడు మూవీస్ కూడా చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. సరే ఇదంతా పక్కనబెడితే రష్మిక గురించి తోటి హీరోయిన్ ఓ ఫన్నీ వీడియో పోస్ట్ చేసింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కృతి సనన్ ఫన్నీ ప్రశ్న
ఈ ఏడాది ఛావా, సికిందర్, కుబేర చిత్రాలతో వచ్చింది. వీటిలో రెండు హిందీ మూవీస్. వచ్చే నెలలో ‘థామా’ అనే బాలీవుడ్ హారర్ సినిమాతో రాబోతుంది. ఇది కాకుండా ‘గర్ల్ ఫ్రెండ్’ అనే తెలుగు చిత్రం కూడా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఇవి కాకుండా ‘కాక్ టెయిల్ 2’ అనే హిందీ మూవీ కూడా చేస్తోంది. ఇందులో రష్మికతో పాటు కృతి సనన్ హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా వీళ్లిద్దరూ ఓ జిమ్‌లో కలిశారు. అయితే కృతి అక్కడకి వెళ్లడానికంటే ముందే రష్మిత వర్కౌట్స్ చేస్తూ కనిపించింది.
‘రష్మిక నువ్వు ఎప్పుడు చూసినా జిమ్‌లోనే కనిపిస్తున్నావ్. కొంపదీసి ఇక్కడే బతికేస్తున్నావా?’ అని కృతి సనన్ నవ్వుతూ అడగ్గా.. బదులిచ్చిన రష్మిక.. ‘నువ్వు వచ్చేటప్పుడు నేను ఇక్కడ ఉంటున్నాను. ఎక్కువగా ఏం చేయడం లేదు’ అని నవ్వేసింది. ‘నువ్వు చాలా కష్టపడుతున్నావ్’ అని కృతి సనన్ అనేసరికి వీళ్లిద్దరూ గట్టిగా నవ్వేసుకున్నారు. ఈ వీడియోని కృతి సనన్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
రష్మిక, కృతి సనన్ మధ్య ఈ సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది. స్టార్ హీరోయిన్‌ల మధ్య స్నేహాన్ని, సరదాని చాటిచెప్పే ఈ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.


