|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rashmika-Vijay: కొత్తగా పెళ్లైన జంటలా రష్మిక-విజయ్.. ఆ వీడియో చూశారా?

Published: 19-08-2025, 12:46 PM
Rashmika-Vijay: కొత్తగా పెళ్లైన జంటలా రష్మిక-విజయ్.. ఆ వీడియో చూశారా?

టాలీవుడ్‌లోని ప్రముఖ జంట రష్మిక మందన్నా మరియు విజయ్ దేవరకొండల న్యూయార్క్ పరేడ్ లోని వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వీరిద్దరి సన్నిహితతను చూసి నెటిజన్లు కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలా అంటున్నారు.

Key Points

1

రష్మిక-విజయ్ జంట న్యూయార్క్‌లోని స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్నారు.

2

వారి సన్నిహితతను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

4

ఈ జంట యొక్క కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంటోంది.

న్యూయార్క్ పరేడ్ లో రష్మిక, విజయ్

టాలీవుడ్ ‌ లో లవ్ బర్డ్స్ ‌ గా పేరున్న జంట రష్మిక మందన్నా , విజయ్ దేవరకొండ . కొన్నేళ్లుగా వీరిద్దరిపై చాలా సార్లు డేటింగ్ రూమర్స్ ‌ వినిపిస్తూనే ఉన్నాయి . కానీ ఇప్పటివరకు ఎవరూ కూడా రియాక్ట్ అవ్వలేదు . అయినప్పటికీ వీరిద్దరు చాలాసార్లు వేకేషన్స్ ‌, ఫెస్టివల్స్ ‌ లో సందడి చేస్తూ కనిపించారు . సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు , వీడియోలతో నెటిజన్లకు ఈజీగా దొరికిపోవటం వీరిద్దరి స్పెషాలిటీ .

వైరల్ అవుతున్న వీడియో

తాజాగా ఈ జంట ఓకే వేదికపై అఫీషియల్ ‌ గా మెరిశారు . అమెరికాలోని న్యూయార్క్ ‌ లో నిర్వహించిన 79 వ స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ ‌ లో సందడి చేశారు . అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించారు . దీనికి సంబంధించిన వీడియోలు , ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి . ఇది చూసిన నెటిజన్స్ మరోసారి క్రేజీ కామెంట్స్ చేశారు .

నెటిజన్ల కామెంట్లు

అయితే ఈ పరేడ్ ‌ కు సంబంధించిన మరో వీడియో నెట్టంట వైరల్ ‌ గా మారింది . రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్ ‌ షేర్ చేసిన ఈ వీడియోలో విజయ్ దేవరకొండ మరింత సన్నిహితంగా కనిపించారు . పెన్నుతో విజయ్ దేవరకొండను పిలుస్తూ స్పెషల్ అట్రాక్షన్ ‌ గా నిలిచింది . ఇది చూసిన ఫ్యాన్స్ వీరిద్దరిని చూస్తుంటే కొత్తగా పెళ్లైన వధూవరుల మాదిరి కనిపిస్తున్నారంటూ ట్విటర్ ‌ లో రాసుకొచ్చారు . ఈ జంటను కెమిస్ట్రీ న్యూ వెడ్డింగ్ ‌ కపుల్ ‌ వైబ్ ‌ ను తలపిస్తోందంటూ పోస్ట్ చేశారు . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ ‌ చల్ చేస్తోంది .

రష్మిక మరియు విజయ్ ల మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీ అభిమానులను మరింత ఆకర్షిస్తోంది. వారి వైరల్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.