|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రష్మికకి ఆల్రెడీ అతడితో నిశ్చితార్థం, బ్రేకప్.. విజయ్ దేవరకొండతో ప్రేమ ఎలా మొదలైందంటే

Published: 04-10-2025, 8:48 AM
రష్మికకి ఆల్రెడీ అతడితో నిశ్చితార్థం, బ్రేకప్.. విజయ్ దేవరకొండతో ప్రేమ ఎలా మొదలైందంటే

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన రష్మిక, విజయ్ దేవరకొండ జంట ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. వారి ప్రేమకథ గీత గోవిందం నుండి మొదలై, అనేక ఊహాగానాల మధ్య పెరిగి, ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ ఆసక్తికర ప్రేమ ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం.

Key Points

1

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఇటీవల నిశ్చితార్థం చేసుకొని వివాహానికి సిద్ధమవుతున్నారు.

2

వీరిద్దరి ప్రేమకథ 'గీత గోవిందం' సినిమాతో మొదలై క్రమంగా బలపడింది.

4

న్యూ ఇయర్ లైవ్ సెషన్, దీపావళి ఫోటోల ద్వారా అభిమానులకు వారి ప్రేమపై ఆధారాలు లభించాయి.

గీత గోవిందం నుండి నిశ్చితార్థం వరకు

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన జంటల్లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రధానంగా ఉంటారు. తెరపై వారి కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో, తెరవెనుక కూడా వారిద్దరి మధ్య ఏదో ప్రత్యేక అనుబంధం ఉందనే వార్తలు చాలాకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్తలని నిజం చేస్తూ రష్మిక, విజయ్ దేవరకొండ జంట శుక్రవారం రోజు నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి లవ్ స్టోరీ ఎలా ప్రారంభమైంది ? అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

విజయ్ దేవరకొండ, రష్మీకల జర్నీ రీల్ లైఫ్ తో మొదలై రియల్ లైఫ్ కి చేరుకుంది. తొలిసారి వీరిద్దరూ గీత గోవిందం చిత్రంలో నటించారు. ఈ మూవీలో విజయ్, రష్మిక మధ్య క్యూట్ రొమాన్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. విజయ్ దేవరకొండ, రష్మిక తొలిసారి కలుసుకుంది ఈ చిత్రం కోసమే.

రష్మిక గత నిశ్చితార్థం, బ్రేకప్ కథ

విజయ్ దేవరకొండతో పరిచయం కంటే ముందుగానే రష్మికకి కన్నడ నటుడు, తన కోస్టార్ రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరిగింది. కానీ ఊహించని విధంగా ఈ జంట మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దీనితో రష్మిక.. రక్షిత్ తో తన ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తో పరిచయం ఏర్పడింది.

2019లో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో రష్మిక–విజయ్ కలిసి నటించారు. ఈ సినిమాలో వీరిద్దరూ బోల్డ్ గా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. దీనితో వారి నిజ జీవిత సంబంధంపై ఊహాగానాలను మరింత పెరిగాయి. తరచుగా వీరిద్దరూ సందర్భం వచ్చినప్పుడల్లా కలిసేవారు. దీనితో విజయ్, రష్మిక మధ్య సంథింగ్ సంథింగ్ అనే ప్రచారం ఎక్కువైంది.

ప్రేమ పుకార్లు నిజమయ్యే క్షణాలు

2023లో న్యూ ఇయర్ సందర్భంగా రష్మిక లైవ్ సెషన్‌లో పాల్గొంది. ఆ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో విజయ్ వాయిస్ వినిపించిందని అభిమానులు గుర్తించారు. అదే ఏడాది దీపావళి సందర్భంగా రష్మిక–విజయ్ వేరువేరుగా పోస్ట్ చేసిన ఫొటోల్లో గోడ కలర్ ఒకేలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేశారు. దీని ఆధారంగా రష్మిక విజయ్ ఇంట్లోనే ఉన్నారని ఊహించారు.

విజయ్ దేవరకొండ, రష్మిక ఇక అభిమానులతో దాగుడు మూతలు ఆడడం ఆపేశారు. తమ రిలేషన్ ని అఫీషియల్ చేస్తూ అక్టోబర్ 3న శుక్రవారం రోజు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరి వివాహ వేడుక జరగనుంది. వీరిద్దరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఉండబోతోంది. .

రష్మిక, విజయ్ దేవరకొండల ప్రేమకథ ఎన్నో మలుపులు తిరిగి చివరకు నిశ్చితార్థంతో ఒక కొలిక్కి వచ్చింది. అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వీరి బంధం త్వరలో వివాహ బంధంగా మారనుంది. ఈ జంటకు శుభాకాంక్షలు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.