
📌 Key Points
- ‘ఛలో’తో తెలుగులో పరిచయం, ‘యానిమల్’, ‘పుష్ప 1,2’తో స్టార్‌డమ్ సంపాదించింది.
- విజయ్ దేవరకొండతో సీక్రెట్ రిలేషన్‌లో ఉందని, ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు కూడా వార్తలు.
- పాత్రల కోసం వెంపర్లాడటం పోయి, ఇప్పుడు రచయితలే తన కోసం కథలు రాస్తున్నారంటోంది.
- డబ్బు కోసమే సినిమాలు చేసే రోజులు పోయాయని రష్మిక మందన్న స్పష్టం చేసింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్ ప్రస్థానంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. పాత్రల కోసం వెంపర్లాడిన రోజులు పోయాయని, ఇప్పుడు రచయితలే తన కోసం కథలు రాస్తున్నారని వెల్లడించింది. డబ్బు కోసం మాత్రమే సినిమాలు చేయనని రష్మిక స్పష్టం చేసింది.
రష్మిక కెరీర్ గ్రాఫ్: ఛలో నుండి పుష్ప 2 వరకు
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandana) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’(Chalo) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ చిన్నది ఫస్ట్ సినిమాతోనే యూత్‌కు క్రష్‌గా మారిపోయింది. ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ విజయం సాధించాయి. ఇక ‘యానిమల్’(animal), ‘పుష్ప-1’(Pushpa-1), ‘పుష్ప-2’(Pushpa-2) సినిమాలతో ఈ అమ్మడు రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా రీసెంట్‌గా ‘ది గర్ల్‌ఫ్రెండ్’(The Girl Friend) సినిమాతో మంచి విజయం సాధించిన ఈ చిన్నది ప్రజెంట్ ‘కాక్‌టెయిల్’, ‘మైసా’ వంటి సినిమాల్లో నటిస్తోంది.
విజయ్ దేవరకొండతో రష్మిక రిలేషన్ వార్తలు
ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో సీక్రెట్ రిలేషన్‌లో ఉంది. చాలా సార్లు వీరు కెమెరాకు చిక్కడంతో ఈ విషయం కాస్త అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నట్లు సమాచారం. కానీ ఈ జంట మాత్రం దీనిపై అఫీషియల్‌గా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
పాత్రల ఎంపికపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
ఆమె మాట్లాడుతూ.. ‘‘నటిగా సినిమా సినిమాకీ బాధ్యత పెరుగుతూనే ఉంది. ఇప్పుడు పాత్రల కోసం వెంపర్లాడే స్థితి నుంచి, మంచి పాత్ర కోసం ఆరాటపడే స్థాయికి చేరుకున్నాను. డబ్బు కోసం మాత్రమే సినిమాలు చేసే రోజులు పోయాయి. ప్రస్తుతం నా కోసం రచయితలు ప్రత్యేకంగా కథలు తయారు చేస్తున్నారు. ఓ విధంగా ఇది నా విజయం. ఫలానా తరహా పాత్రలే చేయాలని అనుకోవడం లేదు. నా కంటే రచయితలనే ఈ విషయంలో ఎక్కువగా నమ్ముతాను. నాకు సూటయ్యే పాత్రలనే వారు నా దగ్గరకు తెస్తారని నా నమ్మకం’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రష్మిక మందన్న చేసిన ఈ వ్యాఖ్యలు ఆమె కెరీర్‌లో ఒక ముఖ్యమైన మలుపును సూచిస్తున్నాయి. నాణ్యమైన పాత్రలకు ఆమె ఇస్తున్న ప్రాధాన్యత, వృత్తి పట్ల ఆమె నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకం.


