|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ravi Babu: తెలుగు సినిమాల్లో యాక్టింగ్ చేయరు.. ఓవర్ యాక్టింగ్ చేస్తారు.. మురారి సినిమాలో అదే జరిగింది..

Published: 29-11-2025, 10:04 PM
Ravi Babu: తెలుగు సినిమాల్లో యాక్టింగ్ చేయరు.. ఓవర్ యాక్టింగ్ చేస్తారు.. మురారి సినిమాలో అదే జరిగింది..

వినూత్న చిత్రాల దర్శకుడు రవి బాబు తన తాజా సినిమా ప్రమోషన్స్‌లో టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాల్లో యాక్టింగ్ కాకుండా ఓవర్‌యాక్టింగ్ చేస్తారని, మురారిలో తానూ అదే చేసి విజయం సాధించానని పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Key Points

1

రవి బాబు టాలీవుడ్‌లో వినూత్న చిత్రాల దర్శకుడు.

2

ఆయన తాజా చిత్రం “ఏనుగుతొండం ఘటికాచలం” ఓటీటీలో విడుదలైంది.

4

'మురారి' సినిమాలో తాను ఓవర్‌యాక్టింగ్ చేసి చాలా మందికి నచ్చింది అని వెల్లడించారు.

వినూత్న దర్శకుడిగా రవి బాబు ప్రస్థానం

Ravi Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో వినూత్న చిత్రాల దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రవి బాబు(Ravi Babu) అనే చెప్పాలి. రెగ్యులర్ సినిమాలకు ఆయన సినిమాలకు చాలా వైవిధ్యం ఉంటుంది. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటారు ఆయన. కాన్సెప్ట్, కథలు, కథనం కూడా చాలా వింతంగా ఉంటుంది. అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, పార్టీ, అమరావతి, అనసూయ, అవును.. ఇలా ప్రతీ సినిమా దేనికదే వినూత్నంగా ఉంటాయి. చాలా గ్యాప్ తరువాత ఆయన చేసిన లేటెస్ట్ మూవీ “ఏనుగుతొండం ఘటికాచలం”. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో విడుదల అయ్యింది.

ఓవర్‌యాక్టింగ్‌పై రవి బాబు సంచలన వ్యాఖ్యలు

Pragya Jaiswal: పరువాలను ఎర వేస్తూ.. ప్రగ్యా సోయగాల విందు.. ఫోటోలు

‘మురారి’ అనుభవం, వైరల్ కామెంట్స్

ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న దర్శకుడు రవి బాబు తన సినిమాల గురించి, టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. “తెలుగు సినిమాలు నాకు చాలా వింతగా అనిపిస్తాయి. మనవాళ్ళు యాక్టింగ్ చేయరు ఓవర్ యాక్టింగ్ చేస్తారు. నేను కూడా ముందు నార్మల్ గా నటించేవాణ్ణి. కానీ, ఓవర్ యాక్టింగ్ చేయాలనీ అర్థమయ్యింది. మురారి సినిమాలో అలాగే ఓవర్ యాక్టింగ్ చేశాను. అది చాలా మందికి నచ్చింది. విలన్ గా కూడా అలాగే చేశాను. నన్ను చూసి బయట కూడా భయపడుతున్నారు”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రవి బాబు వ్యాఖ్యలు టాలీవుడ్ నటనా శైలిపై కొత్త చర్చకు దారితీశాయి. తనదైన ముక్కుసూటితనంతో చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మురారిలో ఆయన ఓవర్‌యాక్టింగ్ గురించి చేసిన ప్రకటన మరింత చర్చనీయాంశమైంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.