
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసృర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేజీఎఫ్, సలార్‌లను మించి ఈ సినిమా మ్యూజిక్ ఉండబోతుందని, కొత్త ఇన్‌స్ట్రూమెంట్స్ ఉపయోగిస్తున్నామని ఆయన వెల్లడించారు.
Key Points
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసృర్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేజీఎఫ్, సలార్‌తో పోలిస్తే కొత్త మ్యూజిక్, ఎమోషన్స్ ఉంటాయని రవి బాసృర్ వెల్లడించారు.
ఈ చిత్రానికి కొత్త ఇన్‌స్ట్రూమెంట్స్ ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాపై భారీ అంచనాలు
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ బాంబోలో ఓ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కేజేఎఫ్, సలార్ బ్లాక్ బస్టర్స్ తరువాత స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో నెలకొన్నాయి. ఇక హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అవడంతో ఆ అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. నిజానికి ఎన్టీఆర్ కి క్రేజీ ఫాలోయింగ్ ఉంది. దానికి తగ్గట్టుగా ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ పడితే మాత్రం సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్లడం ఖాయం. గత రికార్స్డ్ అన్ని గల్లంతవడం ఖాయం. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
NBK 111: రాజ్యంలోకి రాణి ఆగమనం.. ‘మహారాణి’గా నయనతార.. NBK 111 నుంచి క్రేజీ వీడియో
రవి బాసృర్ సంచలన వ్యాఖ్యలు
అంతేకాదు, ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసృర్(Ravi Basrur). ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గతంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఉగ్రం, కేజీఎఫ్, సలార్ సినిమాలకు వర్క్ చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు ఈయనే వర్క్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఈయన నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
కేజీఎఫ్, సలార్‌కి మించిన మ్యూజిక్
“కేజీఎఫ్, సలార్ లాంటి సూపర్ హిట్స్ తరువాత ప్రశాంత్ నీల్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్. ప్రశాంత్ నీల్‌తో నా బాండింగ్ అనేది చాలా స్పెషల్. తక్కువ మాట్లాడుకుంటాం.. ఎక్కువ వర్క్ చేస్తాం. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమాలో విజువల్స్ తోపాటు మ్యూజిక్ కూడా భారీ స్థాయిలో ఉంటుంది. ఈసారి ఎలివేషన్స్ తో పాటు, ఎమోషన్స్‌కు పెద్ద పీట వేశారు దర్శకుడు. కేజీఎఫ్, సలార్ మ్యూజిక్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. అందుకోసం కొత్త ఇన్‌స్ట్రూమెంట్ యూజ్ చేస్తున్నాం. అందరికీ తప్పకుండా నచ్చుతుంది”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో రవి చేసిన ఈ కామెంట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు.
రవి బాసృర్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ప్రశాంత్ నీల్ విజన్, రవి బాసృర్ సంగీతం కలగలిపి ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తాయని ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ చిత్రం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

