
📌 Key Points
- నుపుర్ సనన్ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన యంగ్ బ్యూటీ.
- ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్‌తో నుపుర్ రహస్యంగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు సమాచారం.
- రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జనవరి 11న వీరి వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి.
- సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి వేడుకకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా హీరోయిన్ నుపుర్ సనన్ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్‌తో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న ఆమె, సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకుంది. జనవరి 11న ఉదయ్‌పూర్‌లో వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
నుపుర్ సనన్: టాలీవుడ్‌కు పరిచయం
రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ బ్యూటీ నుపుర్ సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమా ఆశించినంత హిట్ కానప్పటికీ ఈ భామ అందానికి యూత్ ఫిదా అయ్యారు. ప్రజెంట్ బాలీవుడ్‌లో అడపా దడపా సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇక ఈ చిన్నది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌కు సొంత చెల్లెలు కావడం విశేషం. ఇదిలా ఉంటే నుపుర్ సనన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
వైరల్ అవుతున్న ఎంగేజ్‌మెంట్ ఫొటోలు
తాజాగా నుపుర్ తన సోషల్ మీడియాలో అతని ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఫొటోలను షేర్ చేసింది. అంతేకాకుండా వీటికి.. ‘బహుశాలతో నిండిన ప్రపంచంలో, నేను నా సోల్‌ను కనుగొన్నాను’ అనే క్యాప్షన్ జోడించింది. అయితే వీరి ఎంగేజ్‌మెంట్‌ను కేవలం ఫ్రెండ్స్ సమక్షంలో మాత్రమే జరుపుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. సెలబ్రిటీలు, నెటిజన్లు, ఫ్యాన్స్ ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
పెళ్లి ఎప్పుడు? వివరాలివే
కాగా నుపుర్ సనన్ గత మూడేళ్లుగా ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్‌తో ప్రేమలో ఉంది. తాజాగా ఈ జంట తమ ప్రేమను వివాహంతో మరో అడుగు ముందుకు తీసుకెళ్లటానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జనవరి 11న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగనుందట. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే పెళ్లి జరిపించాలని ప్లాన్ చేస్తున్నారట. పెళ్లి అనంతరం ముంబయిలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
నుపుర్ సనన్, స్టెబిన్ బెన్ వివాహంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, వారి అభిమానులు మాత్రం ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరి పెళ్లి టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


