
నేషనల్ అవార్డు విజేత డైరెక్టర్ సందీప్ రాజ్, తన కొత్త సినిమా కోసం రవితేజను సంప్రదించగా జరిగిన సంఘటనను వెల్లడించారు. మూడేళ్ళుగా ప్రయత్నించినా, రవితేజ బిజీ షెడ్యూల్‌తో సినిమా అవకాశం దక్కలేదు. రవితేజ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Key Points
డైరెక్టర్ సందీప్ రాజ్ రవితేజతో సినిమా కోసం ప్రయత్నించారు.
మూడేళ్ల తర్వాత కూడా రవితేజ బిజీగా ఉన్నారని తెలిసింది.
రవితేజ తన కథ ఇంకెవరితోనైనా తీస్తే చంపేస్తానని హెచ్చరించారు.
సందీప్ రాజ్ ఇప్పుడు యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో థియేట్రికల్ డెబ్యూ చేయబోతున్నారు.
సందీప్ రాజ్ షాకింగ్ వెల్లడి
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్(Sandeep Raj) ‘కలర్ ఫొటో’ మూవీతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. డెబ్యూ మూవీతోనే నేషనల్ ఫిలిం అవార్డును గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు తన నిర్మాణంలో ‘AIR – ఆల్ ఇండియా ర్యాంకర్స్’(AIR – All India Rankers) అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నేను ఎవరి దగ్గరకు వెళ్లినా వాళ్లని మించిన కథను తీసుకొని వెళ్తున్నాను. దాని వల్ల బడ్జెట్ సెట్ అవ్వడం లేదు. ఒక సినిమా కోసం హీరో రవితేజతో ట్రావెల్ చేశాను. అయితే ఈ ఏడాది కూడా ఆయన బిజీగా ఉన్నారు.
‘అనవసరంగా నీ గోల్డెన్ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావ్.. నాకు రెండు కమిట్మెంట్స్ ఉన్నాయి. అర్థం చేసుకో అబ్బాయ్’ అని రవితేజ నాతో అన్నారు. అప్పటికే మూడేళ్లు అయింది. నేను ఇంకో కథ రాసుకోవడం స్టార్ట్ చేస్తాను అని చెప్పాను. ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా హ్యాపీగా చేసుకొని రమ్మన్నారు. నాకు చెప్పిన కథ ఇంకెవరితో అయినా తీస్తే చంపేస్తాను.. నాతోనే తీయాలి అని రవితేజ అన్నారు. అది మీకోసమే రాసిన స్టోరీ అని చెప్పాను. ఫ్రెష్ గా ఈసారి థియేట్రికల్ డెబ్యూ చేస్తున్నానని అనుకోని ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాయాలని నిర్ణయించుకున్నా’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రవితేజ బిజీ షెడ్యూల్
కొత్త ప్రాజెక్ట్‌పై దృష్టి
రవితేజ వ్యాఖ్యలతో షాక్ అయిన సందీప్ రాజ్, యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


