|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘ఈగల్’ సినిమా ఎఫెక్ట్.. నాలుగు భారీ ప్రాజెక్ట్స్‌తో రాబోతున్న రవితేజ.. ఈ సారైనా హిట్ అందుకుంటాడా?

Published: 16-10-2025, 8:51 PM
‘ఈగల్’ సినిమా ఎఫెక్ట్.. నాలుగు భారీ ప్రాజెక్ట్స్‌తో రాబోతున్న రవితేజ.. ఈ సారైనా హిట్ అందుకుంటాడా?

‘ఈగల్’ మూవీ డిజాస్టర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ ఏకంగా నాలుగు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. హిట్ కోసం ప్రయత్నిస్తున్న రవితేజ.. ‘మాస్ జాతర’, RT-76, RT-77, RT-78 వంటి విభిన్న జానర్ల చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సారైనా ఆయన విజయం సాధిస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Key Points

1

రవితేజ ‘ఈగల్’ సినిమా డిజాస్టర్ తర్వాత వరుసగా నాలుగు ప్రాజెక్ట్‌లు ప్రకటించారు.

2

నాలుగు చిత్రాలు విభిన్న జానర్లలో తెరకెక్కుతున్నాయి, హిట్ కోసం రవితేజ ప్రయత్నం.

4

కిషోరు తిరుమల, శివ నిర్వాణ, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో RT-76, RT-77, RT-78 సిద్ధమవుతున్నాయి.

‘ఈగల్’ తర్వాత రవితేజ వ్యూహం

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)గత ఏడాది ‘ఈగల్’ మూవీతో వచ్చి భారీ డిజాస్టర్‌ను చవిచూశారు. గత కొద్ది రోజులుగా హిట్ ఫ్లాప్ అని పట్టించుకోకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం హిట్ కోసం తాపత్రయ పడుతున్నారు. రవితేజ ఏకంగా నాలుగు భారీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టారు. నాలుగు విభిన్న జానర్స్‌లో ఈ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న చిత్రం ‘మాస్ జాతర’ (mass jathara). రవితేజ శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ఈ చిత్రంతో పాటు రవితేజ, కిషోరు తిరుమల కాంబోలో ఈ ప్రాజెక్ట్ రానుంది.

‘RT-76’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతుండగా.. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా రాబోతుంది. రవితేజ, శివ నిర్వాణతో కూడా నటిస్తున్నారు. ‘RT-77’తో రాబోతున్న ఈ చిత్రం థ్రిల్లర్ డ్రామాగా రానుంది. అంతేకాకుండా.. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రవితేజ RT-78 మూవీ చేస్తున్నారు. సూపర్ హీరో కథ నేపథ్యంలో రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. నటీనటులకు సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉంది. ఈ నాలుగు ప్రాజెక్ట్స్‌ షూటింగ్స్‌తో రవితేజ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వారంతా ఈసారి అయినా హిట్ అందుకుంటాడా? అదృష్టం కలిసొచ్చేనా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు భారీ ప్రాజెక్ట్‌ల వివరాలు

వివిధ జానర్లలో రవితేజ చిత్రాలు

మొత్తం మీద నాలుగు భారీ ప్రాజెక్ట్‌లతో రవితేజ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ‘ఈగల్’ తర్వాత వచ్చిన ఈ సినిమాలతో రవితేజ ఖాతాలో హిట్ పడుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.