
📌 Key Points
- ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో రష్మిక, విజయ్ వివాహం అంగరంగ వైభవంగా జరుగుతున్న వేడుక!
- ఉదయం 10:10 గంటలకు విరోష్ వెడ్డింగ్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం, వేడుక మొదలైంది!
- విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి, రష్మికతో యానిమల్ మూవీ తీసిన సందీప్ వంగా హాజరు!!
- కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు గ్రాండ్ గా జరిగాయని సమాచారం!
టాలీవుడ్ ప్రేమ జంట ఒక్కటయ్యే శుభ తరుణం రానే వచ్చింది. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల వివాహం ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఉదయ్‌పూర్‌లో విరోష్ వెడ్డింగ్ సందడి!
virosh wedding: ఆ రోజు రానే వచ్చింది. కొన్నేళ్లుగా డేటింగ్, రిలేషన్ షిప్, లవ్ ఊహాగానాలకు తెరదించుతూ రష్మిక, విజయ్ ఒక్కటయ్యేది ఈ రోజే. ఇవాళ ఉదయ్‌పూర్‌లో విరోష్ వెడ్డింగ్ జరుగుతుంది. ముహూర్తం ఎన్ని గంటలకో ఓ సారి చూసేయండి.
కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇవాళే విరోష్ వెడ్డింగ్. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్లో రష్మిక, విజయ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతోంది. వీళ్ల పెళ్లి ముహూర్తం ఎన్ని గంటలకు నిశ్చయించారో ఒకసారి చూసేయండి.
విరోష్ వెడ్డింగ్ ముహూర్తం
విజయ్, రష్మికల పెళ్లి ముహూర్తం ఫిక్స్!
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి గురువారం ఏడు అడుగులు వేయబోతున్నారు. తమ జీవితాలను పెళ్లితో ముడి వేసుకోబోతున్నారు. ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మొమెంటోస్ హోటల్లో ఇవాళ ఉదయం 10.10 గంటలకు విరోష్ వెడ్డింగ్ ముహూర్తం నిశ్చయించారని తెలిసింది.
ఈ రోజు విరోష్ వెడ్డింగ్ రెండు సార్లు జరుగుతుంది. ఫస్ట్ తెలుగు సంప్రదాయంలో వివాహం జరుగుతుంది. వధువు రష్మిక మందన్న మెడలో వరుడు విజయ్ దేవరకొండ మూడు ముళ్లు వేస్తాడు. ఈ జంట ఏడు అడుగులు నడుస్తుంది. ఆ తర్వాత మరోసారి కొడవ సంప్రదాయంలోనూ విరోష్ పెళ్లి జరుగుతుందని సమాచారం.
విరోష్ వెడ్డింగ్ కోసం సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఉదయ్‌పూర్‌కు చేరుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని సందీప్ తెరకెక్కిస్తున్నాడు. అయితే రష్మిక, విజయ్ పెళ్లి కోసం అతను షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడని సమాచారం. విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీని సందీప్ తీసిన సంగతి తెలిసిందే. అలాగే సందీప్ మరో మూవీ యానిమల్ లో రష్మిక హీరోయిన్.
స్పిరిట్ షూటింగ్ నుండి పెళ్లికి సందీప్ వంగా!
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి కోసం ఇప్పటికే అతిథులు ఉదయ్‌పూర్ చేరుకున్నారు. ఈ విరోష్ వెడ్డింగ్ కు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, అత్యంత సన్నిహితులను మాత్రమే ఇన్వైట్ చేశారు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, రాహుల్ రవీంద్రన్ తదితరులు ఈ పెళ్లికి వెళ్లారు.
విరోష్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు గ్రాండ్ గా జరిగాయి. విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో వరుడు, వధువు తరపున వాళ్లు క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఆ తర్వాత మెహందీ, హల్దీ, సంగీత్ ఈవెంట్లు సందడిగా సాగాయి. సంగీత్ లో తమకు కాబోయే కోడలు రష్మిక మందన్నకు విజయ్ దేవరకొండ తల్లి మాధవి ప్రత్యేక బహుమతిగా గాజులు అందించారని తెలిసింది.
కుటుంబ వారసత్వంగా అందిస్తున్న గాజులను రష్మికకు మాధవి ఇచ్చారని సమాచారం. ఈ క్షణంలో అందరూ ఎమోషనల్ అయిపోయారని తెలిసింది. ఈ రోజు పెళ్లి తర్వాత మార్చి 4న హైదరాబాద్ లో విరోష్ జోడీ గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయనుంది.
రష్మిక, విజయ్ ల వివాహం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


