
వరుస పరాజయాలతో నిరాశపరిచిన రవితేజ, ఇప్పుడు బలంగా తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన తదుపరి నాలుగు చిత్రాలు ఒక్కొక్కటీ ఒక్కో జోనర్‌లో రూపొందుతూ అభిమానులలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మాస్ జాతర నుండి సూపర్ హీరో కథల వరకు, రవితేజ లైనప్ పూర్తి వివరాలు ఇక్కడ.
Key Points
రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర' అక్టోబర్ 31న విడుదల.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో RT76 ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.
శివ నిర్వాణ డైరెక్షన్లో RT77 థ్రిల్లర్ డ్రామాగా రానుంది.
కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో రవితేజ RT78 సూపర్ హీరో జానర్‌లో.
రవితేజ RT75: మాస్ జాతర వివరాలు
రవితేజకి ఇటీవల బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ లేదు. మిస్టర్ బచ్చన్, ఈగల్, టైగర్ నాగేశ్వర రావు లాంటి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. కానీ టాలీవుడ్ లో మాస్ చిత్రాలతో పాటు వైవిధ్యమైన కథలతో మెప్పించే హీరోలలో రవితేజ ఒకరు. రవితేజ తదుపరి చిత్రాల లైనప్ ప్రామిసింగ్ గా ఉంది. రవితేజ కంబ్యాక్ ఇవ్వడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. ఎందుకంటే రవితేజ నటిస్తున్న తదుపరి నాలుగు చిత్రాలు ఒక్కొక్కటి ఒక్కో జోనర్ లో రూపొందుతున్నారు. ఆ చిత్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం.
రవితేజ నటించిన 75వ సినిమా మాస్ జాతర, అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజతో పాటు శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఫన్ అండ్ థ్రిల్లింగ్: RT76, RT77 చిత్రాలు
మాస్ జాతర తర్వాత రవితేజ RT76లో నటిస్తున్నారు. ఇది ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అషికా రంగనాథ్, కేతికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్పెయిన్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. రాబోయే సంక్రాంతి 2026 సీజన్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
మూడవ ప్రాజెక్ట్ RT77, ఇది శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోంది. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి ప్రేమకథలతో ప్రేక్షకుల మన్నన పొందిన శివ నిర్వాణ, ఈసారి రవితేజతో థ్రిల్లర్ డ్రామా చేయబోతున్నారు. ఈ చిత్రంలో రవితేజ వయస్సుకు తగ్గ పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
సూపర్ హీరోగా రవితేజ RT78
రవితేజ నాలుగవ ప్రాజెక్ట్ RT78, ఇది సూపర్ హీరో జానర్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో రూపొందించిన కామెడీ డ్రామా ఫ్రాంచైజీ ‘MAD’తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాను కూడా నాగ వంశీ నిర్మించనున్నారు.
మొత్తంగా, రవితేజ రాబోయే నాలుగు చిత్రాలు విభిన్న జోనర్‌లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ వైవిధ్యమైన లైనప్ రవితేజ కెరీర్‌కు మలుపు తిప్పుతుందని, బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తుందని ఆశిద్దాం.


