|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్: పండుగకు ముందే మాస్ సందడి!

Published: 05-01-2026, 5:30 AM
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్: పండుగకు ముందే మాస్ సందడి!
  • మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం.
  • ట్రైలర్ జనవరి 7న సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది.
  • ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో రిలీజ్.
  • ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మాస్ మహారాజ్ రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం ట్రైలర్ అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. జనవరి 7న ట్రైలర్ విడుదల కానుండగా, సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ విడుదల తేదీ

మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) నటిస్తున్న తాజా సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bartha Mahashayulaku Vignapthi). కిశోర్ తిరుమల(Kishore Tirumala) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్(Ashika Ranganath), డింపుల్ హయాతి(Dimple Hayathi) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక దీన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చి సాంగ్స్, టీజర్స్, పోస్టర్స్ అన్నీ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

సంక్రాంతికి సినిమా, కీలక తారాగణం

ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మూవీ టీమ్. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ట్రైలర్ జనవరి 7వ తారీఖున సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. ఇక పోస్టర్‌లో.. రవితేజ, డింపుల్ హయాతీ, ఆషిక రంగనాథ్ ఓ టేబుల్ చుట్టూ కూర్చొని ఉండగా.. రవితేజ, ఆషికా రొమాంటిక్‌గా ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటుండగా.. బుంగమూతి పెట్టుకుని కొంచెం కోపంగా డింపుల్ హయాతీ ఆషిక వైపు చూస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న కొత్త పోస్టర్ విశేషాలు

RAVI TEJA (@raviteja_2628) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

ఇప్పటికే టీజర్స్, పాటలతో అంచనాలు పెంచిన ఈ సినిమా ట్రైలర్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి రానున్న ఈ చిత్రం రవితేజ ఫ్యాన్స్‌కు గొప్ప వినోదాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.