|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హిట్ టాక్ తెచ్చుకున్న రవితేజ సినిమా! సక్సెస్ క్రెడిట్ ఎవరికో తెలుసా?

Published: 17-01-2026, 6:05 AM
హిట్ టాక్ తెచ్చుకున్న రవితేజ సినిమా! సక్సెస్ క్రెడిట్ ఎవరికో తెలుసా?
  • రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం విడుదలైంది.
  • సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.
  • సినిమా సక్సెస్ క్రెడిట్ దర్శకుడు కిషోర్ తిరుమల, సంగీత దర్శకుడు భీమ్స్‌కు దక్కుతుందని రవితేజ అన్నారు.
  • సునీల్ తో తన స్నేహం గురించి రవితేజ సరదాగా మాట్లాడారు.

రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా సంక్రాంతికి విడుదలైంది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. రవితేజ సినిమా విజయం గురించి మాట్లాడారు.

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సక్సెస్ మీట్

Ravi Teja: రవితేజ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి(Bhartha Mahasayulaku Wignyapthi ).  రవితేజ (Raviteja)ఆషికా రంగనాథ్, డింపుల్ హైయతి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 13వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం బ్లాక్ బాస్టర్ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు. ఇక రవితేజ కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్ర బృందంపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాని మంచి హిట్ చేసిన ప్రేక్షకులకు ఈయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు .అనంతరం రవితేజ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా మంచి సక్సెస్ అయింది అంటే ఆ క్రెడిట్ మొత్తం నాది కాదని, ఈ సినిమా ఆఫ్ స్క్రీన్ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ కిషోర్ తిరుమల (Kishore Tirumala), సంగీత దర్శకుడు బీమ్స్ (Bheems)వీరిద్దరికి మాత్రమే దక్కుతుందని రవితేజ ఈ సందర్భంగా తెలియజేశారు.

సునీల్ తో నా ఫ్రెండ్షిప్ వెటకారమైనది..

క్రెడిట్ మొత్తం వారికే: రవితేజ

ఈ సినిమాకు అద్భుతమైన స్క్రిప్ట్ అందించిన డైరెక్టర్ అలాగే అద్భుతమైన బీజీయం అందించిన భీమ్స్ వీరిద్దరికి మాత్రమే ఈ సినిమా క్రెడిట్ దక్కుతుందని తెలియజేశారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తనతో పాటు కలిసిన ఇతర నటినటుల గురించి కూడా రవితేజ తెలియజేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో సునీల్ నటించి సందడి చేయగా సునీల్ గురించి మాట్లాడుతూ.. సునీల్ తో నా ఫ్రెండ్షిప్ వెటకారమైన ఫ్రెండ్షిప్ అంటూ మాట్లాడారు.మా మదర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మా మధ్య కూడా అదే వెటకారం వచ్చింది అనుకుంటా. దుబాయ్‌ శీనులో ఎలా అయితే ఎంజాయ్ చేశానో, మళ్లీ అంతే ఎంజాయ్ చేశానని రవితేజ తెలియజేశారు.

శివ నిర్వాణ డైరెక్షన్ లో రవితేజ..

సునీల్ తో స్నేహం గురించి రవితేజ కామెంట్స్

ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక రవితేజ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా విడుదలయ్యి మిశ్రమ స్పందనను దక్కించుకుంది. ఇటీవల వరుస డిజాస్టర్ సినిమాలను ఎదుర్కొంటున్న రవితేజకు భర్త మహాశయులకు విజ్ఞప్తి కాస్త ఉపశమనం కలిగించదని చెప్పాలి. ఇక ఈ సినిమా చూసిన రవితేజ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రవితేజ చివరిగా మాస్ జాతర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ ఎదుర్కొన్నారు. ఇక ఈయన తన తదుపరి సినిమాని శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిస్తే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

మొత్తానికి, రవితేజ తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మిశ్రమ స్పందనతో మంచి విజయాన్ని అందుకుంది. రవితేజ తన సహచరులకు కృతజ్ఞతలు తెలుపుతూ సినిమా విజయంలో వారి పాత్రను కొనియాడారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.