
📌 Key Points
- రవితేజ ఇటీవల వరుస పరాజయాలతో అభిమానులను నిరాశపరుస్తున్నారు.
- సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే కామెడీ చిత్రంతో రవితేజ రానున్నారు.
- ట్యాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో రవితేజ హారర్ సినిమా చేయనున్నారని తాజా అప్‌డేట్.
- వివేక్ ఆత్రేయ చెప్పిన హారర్ కథ రవితేజకు నచ్చింది; ఫైనల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి.
మాస్ మహారాజా రవితేజ వరుస ఫ్లాప్‌ల తర్వాత, తన తదుపరి చిత్రంపై ఆసక్తికర అప్‌డేట్ వెలువడింది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో రవితేజ ఓ హారర్ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త ప్రయోగంతో ఈసారి హిట్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.
రవితేజకు వరుస పరాజయాలు: అభిమానుల ఆగ్రహం!
తాజాగా రవితేజ నెక్స్ట్ సినిమాపై ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. (Raviteja)
Raviteja : కష్టపడి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మాస్ మహారాజా గా ఎదిగిన హీరో రవితేజ. ఎన్నో హిట్స్ చుసిన రవితేజ గత కొంతకాలంగా మాత్రం వరుస ఫ్లాప్స్ చూస్తున్నారు. ఇటీవల రిలీజయిన మాస్ జాతర కూడా ఫ్లాప్ గానే మిగిలింది. దీంతో ఫ్యాన్స్ సైతం రవితేజ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్క్రిప్ట్, హీరోయిన్స్ సెలక్షన్ విషయంలో ఎక్కువగా మైనస్ అవుతుందని అంటున్నారు.(Raviteja)
త్వరలో సంక్రాంతికి రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో వస్తున్నాడు. ఒకవేళ ఈ సినిమా అటూ ఇటు అయినా సంక్రాంతి టైం కాబట్టి సేఫ్ అయిపోతాడు అని భావిస్తున్నారు. అందుకే రవితేజ ఫ్యామిలీ సినిమాని పట్టుబట్టి మరీ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాడు.
వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా హారర్ ప్రయోగం?
అయితే తాజాగా రవితేజ నెక్స్ట్ సినిమాపై ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో రవితేజ సినిమా చేయనున్నాడట. అంటే సుందరానికి, బ్రోచేవారెవరురా, సరిపోదా శనివారం, మెంటల్ మదిలో లాంటి మంచి సినిమాలు తీసిన డైరెక్టర్, స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ వివేక్ ఆత్రేయతో సినిమా అనగానే ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
వివేక్ ఆత్రేయ రవితేజకు ఒక హారర్ సినిమా కథ చెప్పాడట. రవితేజకు కూడా ఆ పాయింట్ నచ్చింది. ప్రస్తుతం ఫైనల్ డిస్కషన్స్ లో ఉన్నారట. ఇంకొన్ని మార్పులు చేర్పులు చేసి వివేక్ రవితేజకు ఫైనల్ నేరేషన్ ఇస్తే రవితేజతో ఈ సినిమా ఓకే అయిపోతుందని టాలీవుడ్ టాక్.
ఈసారి అయినా హిట్ కొట్టాలని ఆశిస్తున్న ఫ్యాన్స్
మరి నిజంగానే రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమా ఓకే అవుతుందా? రవితేజ మొదటిసారి హారర్ సినిమా చేస్తాడా చూడాలి. ఫ్యాన్స్ అయితే డైరెక్టర్ మీద నమ్మకంతో ఈ సినిమా ఓకే అవ్వాలని కోరుకుంటున్నారు. ఓకే చేస్తే మాత్రం ఈ సినిమాతో అయినా మాస్ మహారాజ హిట్టు కొడతాడు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
రవితేజ హారర్ జానర్‌లోకి అడుగుపెట్టడం, వివేక్ ఆత్రేయ వంటి ప్రతిభావంతుడైన దర్శకుడితో కలిసి పనిచేయడం అభిమానుల్లో కొత్త ఆశలు రేపుతోంది. ఈ కాంబినేషన్ తో మాస్ మహారాజా విజయపథంలోకి తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు.


