|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రవితేజ ‘ఇరుముడి’: మలయాళ బ్లాక్ బస్టర్ రీమేక్ తో మాస్ రాజా షాకింగ్ ఎంట్రీ!?

Published: 26-01-2026, 5:05 AM
రవితేజ 'ఇరుముడి': మలయాళ బ్లాక్ బస్టర్ రీమేక్ తో మాస్ రాజా షాకింగ్ ఎంట్రీ!?
  • రవితేజ ‘ఇరుముడి’: శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ చిత్రం!
  • మలయాళ ‘మాలికాపురం’, ‘కుమారి’ చిత్రాల రీమేక్‌గా వస్తున్న మాస్ మహారాజ కొత్త సినిమా!
  • జీవీ ప్రకాష్ సంగీతం, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా 2026లో విడుదల కానున్న చిత్రం!
  • అయ్యప్ప దీక్షలో రవితేజ లుక్ వైరల్.. సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి!

మాస్ మహారాజ రవితేజ మరో సంచలనానికి తెరలేపారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కావడంతోనే అంచనాలు మొదలయ్యాయి.

ఇరుముడి: రవితేజ కొత్త లుక్ వైరల్!

Raviteja : గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్స్ చూస్తున్న రవితేజ ఇటీవల సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు. నేడే రవితేజ పుట్టిన రోజు కావడంతో తన కొత్త సినిమాని ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఇరుముడి అనే కొత్త సినిమాని ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు.(Raviteja)

ఈ ఫస్ట్ లుక్ లో రవితేజ అయ్యప్ప దీక్షలో నెత్తి మీద ఇరుముడి పెట్టుకొని ఓ చిన్నారిని ఎత్తుకున్నట్టు ఉంది. మాస్ మహారాజ రవితేజ ఒకేసారి ఈ అవతారంలో కనిపించడంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

రీమేక్ వార్తలు.. నిజమెంత?

అయితే ఈ సినిమా రీమేక్ అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. మలయాళంలో ఉన్ని ముకుందన్ హీరోగా 2022 లో మాలికాపురం అనే సినిమా వచ్చింది. ఇద్దరు చిన్నారులు అయ్యప్ప దీక్ష తీసుకొని శబరిమలలో అయ్యప్పను దర్శించడం ఇందుకు సహకరించిన హీరో కథతో వచ్చిన మాలికాపురం సినిమా పెద్ద విజయం సాధించింది. ఓటీటీలో తెలుగు డబ్బింగ్ రావడంతో ఇక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించింది.

దీంతో రవితేజ ఇరుముడి సినిమా ఈ మాలికాపురం సినిమాకు రీమేక్ అని సందేహం వ్యక్తపరుస్తున్నారు. అంతే కాకుండా ఇటీవల శివ నిర్వాణ రవితేజతో హారర్ సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరుముడి సినిమా మలయాళంలో 2022 లో వచ్చిన కుమారి సినిమా రీమేక్ అని కూడా అంటున్నారు పలువురు. హారర్ ఫాంటసీ నేపథ్యంలో వచ్చిన కుమారి సినిమా కూడా అక్కడ మంచి విజయం సాధించింది.

2026లో విడుదల.. భారీ అంచనాలు!

ఆ హారర్ ఫాంటసీతో పాటు అయ్యప్ప దీక్షను కలిపి శివ నిర్వాణ తండ్రి కూతురు ఎమోషన్ తో ఈ సినిమాని సరికొత్తగా తెరకెక్కిస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. మరి ఇది రీమేక్ సినిమానా? లేక ఏదైనా కొత్త కథేనా తెలియాలంటే ఎదురుచూడాల్సిందే. ఈ సినిమా గురించి రవితేజ, జీవి ప్రకాష్ గొప్పగా పొగుడుతూ ట్వీట్స్ చేసారు. 2026 లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తుండగా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది.

రవితేజ ‘ఇరుముడి’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా రీమేక్ అవునా కాదా అనే దానిపై ఇంకా సస్పెన్స్ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.