
📌 Key Points
- రామ్ చరణ్ “పెద్ది” సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయం.
- సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో రాబోయే RC17పై అదిరిపోయే హింట్.
- “మీరు ఎంత ఊహించుకున్నా, సినిమా దాన్ని మించి ఉంటుంది” అని సుకుమార్ వ్యాఖ్య.
- “రంగస్థలం” తర్వాత ఈ కాంబోలో వస్తున్న రెండో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోయే RC17 గురించే! తాజాగా సుకుమార్ ఇచ్చిన అదిరిపోయే హింట్ తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఫ్యాన్స్ ఉత్సాహానికి అవధుల్లేవు!
“పెద్ది” సక్సెస్ మీట్‌లో అదిరిపోయే హింట్!
రామ్ చరణ్ ఇటీవల `పెద్ది` సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ఇది భారీ వసూళ్లని రాబట్టింది. సుమారు నాలుగు వందల వరకు రాబట్టిందని సమాచారం. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. వెంకట్ సతీష్ కిలారు నిర్మించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం జూన్ 4న విడుదలై ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో `పెద్ది` సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. ఇందులో చిరంజీవి గెస్ట్ గా పాల్గొన్నారు. రామ్ చరణ్‌పై, పెద్దిపై ప్రశంసలు కురిపించారు. అలాగే సుకుమార్ కూడా ప్రశంసలు కురిపించారు.
ఈ ఈవెంట్‌కి సుకుమార్ కూడా వచ్చారు. సినిమాపై, చరణ్ నటనపై ప్రశంసలు కురిపించారు. రామ్ చరణ్ అద్బుతంగా నటించాడని తెలిపారు. `రంగస్థలం` ని మించి చేశాడని, చరణ్‌ని నటనని చూస్తుంటే ఆశ్చర్యమేసిందని, అన్నీ మర్చిపోయి ఆయన యాక్టింగ్‌ని చూశామని చెప్పారు. ఈ క్రమంలో అభిమానుల నుంచి తన సినిమాకు సంబంధించిన అప్ డేట్‌ని డిమాండ్ చేశారు. రామ్ చరణ్‌తో సుకుమార్ నెక్ట్స్ సినిమా చేయబోతున్నారు. దీని అప్ డేట్ కావాలని అభిమానులు కోరగా, అదిరిపోయే హింట్ ఇచ్చాడు సుకుమార్.
సుకుమార్ మాటలు.. అంచనాలు అమాంతం పెంచేశాయి!
సినిమా గురించి తానేమీ చెప్పనని, తాను మాటలు చెప్పేవాడిని కాదని తెలిపారు. రెండు మూడు సార్లు ఈ విషయాన్ని రిపీట్ చేశాడు. మీరు ఎంత అడిగినా చెప్పను అని, మీరు ఎంతైనా ఊహించుకోమని తెలిపారు. ఎంత ఊహించుకున్నా దాన్ని మించి సినిమా ఉంటుందనే విషయాన్ని సుకుమార్ తెలిపారు. ఒక్క మాటతోనే `ఆర్‌సీ17`పై అంచనాలను అమాంతం పెంచేశాడు సుకుమార్. ఆయన కామెంట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. సుకుమార్ చివరగా `పుష్ప 2` రూపొందించారు. ఇది ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్‌తో మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారం.
“రంగస్థలం” రికార్డులను బద్దలు కొట్టేనా?
సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో గతంలో `రంగస్థలం` చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. రీజినల్ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇందులో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
సుకుమార్ ఇచ్చిన ఈ మాస్ హింట్ తో RC17పై హైప్ అమాంతం పెరిగింది. “రంగస్థలం” మ్యాజిక్ ను తిరిగి సృష్టించడానికి ఈ కాంబో సిద్ధంగా ఉంది. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం వేచి ఉండండి!


