|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అలా చదవడం ఒక రకమైన హింస.. ఈ ఓటీటీ సిరీస్ తల్లిదండ్రులకి గుణపాఠం కావాలి.. బిగ్ బాస్ శివాజీ కామెంట్స్

Published: 28-06-2025, 9:43 PM
అలా చదవడం ఒక రకమైన హింస.. ఈ ఓటీటీ సిరీస్ తల్లిదండ్రులకి గుణపాఠం కావాలి.. బిగ్ బాస్ శివాజీ కామెంట్స్

బిగ్ బాస్ తెలుగు 7 ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన శివాజీ, తాజాగా ‘ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్’ ట్రైలర్ లాంచ్ లో పాల్గొని చదువు, పోటీ, తెలుగు సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Key Points

1

బిగ్ బాస్ శివాజీ, ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ ట్రైలర్ లాంచ్ లో పాల్గొన్నారు.

2

శివాజీ, ర్యాంకుల కోసం చదవడాన్ని హింసగా అభివర్ణించారు.

4

తెలుగులో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేయాలని శివాజీ కోరిక వ్యక్తం చేశారు.

ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ ట్రైలర్ లాంచ్

బిగ్ బాస్ తెలుగు 7తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో శివాజీ. ఆ తర్వాత ఓటీటీ సిరీస్ 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్, కోర్ట్ మూవీలతో సూపర్ హిట్ కమ్ బ్యాక్ ఇచ్చాడు శివాజీ. తాజాగా బిగ్ బాస్ శివాజీ, హీరో సుహాస్ ముఖ్య అతిథులుగా ఓటీటీ తెలుగు వెబ్ సిరీస్ ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ ట్రైలర్ లాంచ్‌కు హాజరయ్యారు.

సందీప్ రాజ్‌ షో రన్నర్‌గా హర్ష రోషన్, భాను, జయతీర్థ ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్. ఈ ఓటీటీ సిరీస్‌కు జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించారు. జూలై 3 నుంచి ఈటీవి విన్‌లో ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ఈ సందర్భంగా తాజాగా జూన్ 28న ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐఆర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, బిగ్ బాస్ శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

శివాజీ కామెంట్స్

హీరో శివాజీ మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. చదువు అనేది చాలా అవసరం. ఆల్ ఇండియా ర్యాంకర్స్.. ఈ టైటిల్ వినగానే ఈటీవీలో #90కి మించి మరో పెద్ద బ్లాక్ బస్టర్ సిరీస్ రాబోతుందని నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీనికి కనెక్ట్ అవుతారు” అని అన్నాడు.

“చదువు అనేది నేచురల్‌గా చదవాలి. కేవలం ర్యాంక్స్ కోసం చదవడం అనేది ఒక రకమైన హింస. ఈ ఓటీటీ సిరీస్ అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి. ఈటీవీ సమాజం పట్ల చాలా బాధ్యతగా ఉంటుంది. రామోజీరావు గారు తెలుగు జాతిలో పుట్టిన ఆణిముత్యం. వారి సంస్థ నుంచి వచ్చిన కథల్లో చాలా గొప్ప సందేశం ఉంటుంది” అని శివాజీ తెలిపాడు.

తెలుగు సినిమా పరిశ్రమపై అభిప్రాయాలు

“తెలుగులో మాట్లాడితే తెలుగు నటుడుకి ఆ కిక్కు వేరు. అందుకే అందరూ కూడా తెలుగులో స్క్రిప్ట్ రాసుకోవాలని కోరుకుంటున్నాను. తెలుగులో ఉండే మాధుర్యం వేరు. సినిమా అనేది ఎమోషన్. అది మాతృభాషలో రాసినప్పుడు ఇంకా అద్భుతంగా పండుతుంది” అని బిగ్ బాస్ శివాజీ పేర్కొన్నాడు.

” ఈటీవీ విన్ ఓటీటీ కొత్త రకంగా కథల్ని చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా (ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్) చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. అందరికీ థాంక్యు”అని హీరో శివాజీ తన స్పీచ్ ముగించాడు.

బిగ్ బాస్ శివాజీ చేసిన వ్యాఖ్యలు, తెలుగు సినిమా పరిశ్రమలోని అంశాలపై చర్చను రేకెత్తిస్తున్నాయి. ఏఐఆర్ సిరీస్ విజయవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.