
📌 Key Points
- రియల్‌మి 16 5జీ ఫోన్ 50MP ప్రైమరీ, 50MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
- ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
- రియల్‌మి 16 5జీ 60W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
- ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి 16 5జీ అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
భారత మార్కెట్లోకి రియల్‌మి 16 5జీ ఫోన్ విడుదలైంది. ఇది 50MP కెమెరా, 7000mAh బ్యాటరీతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
రియల్‌మి 16 5జీ ధర మరియు వేరియంట్లు
Realme 16 5G : భారత మార్కెట్లో రియల్‌మి 16 5జీ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. గత వారమే భారత మార్కెట్లో లాంచ్ కాగా ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. ధర, స్పెషిఫికేషన్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.
Realme 16 5G : కొత్త రియల్‌మి ఫోన్ కొంటున్నారా? ఇటీవలే భారత మార్కెట్లో రియల్‌మి 16 5G ఫోన్ లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ 5జీ ఫోన్ అమ్మకానికి వచ్చింది. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
7000mAh భారీ బ్యాటరీతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. రియల్‌మి 16 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రియల్‌మి 16 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
Read Also : Oppo F33 Pro : ఒప్పో లవర్స్ గెట్ రెడీ.. ఒప్పో F33 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఇదే.. ధర, స్పెసిఫికేషన్లు లీక్..!
రియల్‌మి 16 5జీ ధర : రియల్‌మి 16 5జీ ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999 కాగా , 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 36,999గా ఉంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ సైట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది.
రియల్‌మి 16 5జీ స్పెసిఫికేషన్లు : రియల్‌మి 16 5జీ ఫోన్ 2372×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4,200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ 6.5-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ 5జీ ఫోన్ 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 7,000mAh బ్యాటరీతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందిస్తుంది.
రియల్‌మి 16 5జీ కెమెరా మరియు బ్యాటరీ వివరాలు
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. రియల్‌మి 16 5జీ బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 అపర్చర్‌తో 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.4 అపర్చర్‌తో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.
కొలతల పరంగా పరిశీలిస్తే.. ఈ రియల్‌మి ఫోన్ 15.83 సెం.మీ పొడవు, 7.51 సెం.మీ వెడల్పు, 0.81 సెం.మీ మందం, 183 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ IP69 రేటింగ్‌తో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, బ్లూటూత్ 5.3, 4G ఎల్టీఈ, జీపీఎస్, Wi-Fi 6, ఒక USB టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
రియల్‌మి 16 5జీ అనేది శక్తివంతమైన ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన ధరతో లభిస్తుంది. ఇది 5జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించాలనుకునే వినియోగదారులకు ఒక మంచి ఎంపిక. వెంటనే కొనుగోలు చేయండి.


