|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈ నటి ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు చిరంజీవితో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన స్టార్ హీరోయిన్‌.. ఇప్పుడు బాగా రిచ్

Published: 05-11-2025, 2:10 AM
ఈ నటి ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు చిరంజీవితో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన స్టార్ హీరోయిన్‌.. ఇప్పుడు బాగా రిచ్

మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ’ వంటి ఇండస్ట్రీ హిట్‌ను అందించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధవి గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే వివరాలను తెలుసుకుందాం.

Key Points

1

మాధవి చిరంజీవితో `ఖైదీ` చిత్రంలో నటించారు, అది అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

2

చిరు-మాధవి కాంబినేషన్‌లో `ప్రాణం ఖరీదు`, `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య` వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి.

4

ప్రస్తుతం ఫార్మా బిజినెస్‌లతో పాటు రెస్టారెంట్‌ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తూ బాగా రిచ్‌గా ఉన్నారు.

మాధవి – చిరంజీవి సూపర్ హిట్ కాంబినేషన్

మెగాస్టార్‌ చిరంజీవితో చాలా మంది హీరోయిన్లు పనిచేశారు. సావిత్రి తరం కాకుండా ఆ తర్వాత వచ్చిన హీరోయిన్లంతా చిరుతో రొమాన్స్ చేసిన వారే. ఇప్పుడొస్తున్న హీరోయిన్లు సైతం ఆయనతో జోడీ కడుతున్నారు. ఆల్మోస్ట్ మూడు తరాల హీరోయిన్లతో ఆయన నటించారని చెప్పొచ్చు. ఇంకా నటిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి హీరోయిన్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్‌ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తు పట్టారా? ఆమె ఎవరో తెలుసుకుందాం.

ఈ ఫోటోల్లో కనిపిస్తోన్న నటి ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ మాధవి. మెగాస్టార్‌తో ఆమె `ఖైదీ` చిత్రంలో నటించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. 1983లో విడుదలైన ఈ సినిమా ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే చిరంజీవి కెరీర్‌ టర్న్ తీసుకుంది. దీనికి ముందు ఆయన దాదాపు అరవై సినిమాలు చేశారు. ఈ చిత్రంతోనే ఆయనకి స్టార్ ఇమేజ్‌ సొంతమైంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా విజయాలు అందుకుంటూ మెగాస్టార్‌గా ఎదిగారు.

ఖైదీ సినిమాతో సినీ కెరీర్ టర్నింగ్

`ఖైదీ` సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించింది మాధవి. ఈ మూవీ కంటే ముందే ఆమె స్టార్‌గా ఎదిగింది. కానీ కమర్షియల్‌గా బిగ్‌ బ్రేక్‌ని, ఆమె కెరీర్‌ని మరో స్థాయికి తీసుకెళ్లిన మూవీ ఇదే కావడం విశేషం. చిరు, రాధాల జోడీ కంటే ముందే చిరంజీవి, మాధవి ల కాంబినేషన్‌ చాలా పాపులర్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో `ప్రాణం ఖరీదు`, `మనవూరిపాండవులు`, `కుక్క కాటుకు చెప్పు దెబ్బ`, `కోతల రాయుడు`, `అగ్ని సంస్కారం`, `ఊరికి ఇచ్చిన మాట`, `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య`, `రోషగాడు`, `సింహపూరి సింహం`, `ఖైదీ`, `చట్టంతో పోరాటం`, `దొంగమొగుడు`, `బిగ్‌ బాస్‌` వంటి చిత్రాలు వచ్చాయి. ఆమె  తెలుగులో ఎక్కువగా చిరుతోనే నటించడం విశేషం. వీరితోపాటు కృష్ణ, కృష్ణంరాజులతోనూ సినిమాలు చేసి విజయాలు అందుకుంది. స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.

ప్రస్తుతం మాధవి ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు?

`బిగ్‌ బాస్‌` తర్వాత ఆమె తెలుగులో సినిమాలు మానేశారు. తెలుగులోనే కాదు మొత్తంగా సినిమాలే మానేశారు. 1996లో వ్యాపారవేత్త రాల్ఫ్‌ శర్మని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరు న్యూజెర్సీ(అమెరికా)లో సెటిల్‌ అయ్యారు. వీరికి ఫార్మా బిజినెస్‌లు ఉన్నాయట. అయితే ఇప్పుడు మాధవి రెస్టారెంట్‌ బిజినెస్‌ని రన్‌ చేస్తున్నారట. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మాధవి ఫ్యామిలీ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ హీరోయిన్‌ బాగా రిచ్‌ కావడం విశేషం. వందల కోట్ల ఆస్తులు ఆమె సొంతమని సమాచారం.

చిరంజీవితో అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి, తెలుగు ప్రేక్షకులను అలరించిన మాధవి, ఇప్పుడు అమెరికాలో విజయవంతమైన వ్యాపారవేత్తగా జీవిస్తున్నారు. ఆమె కెరీర్, ప్రస్తుత జీవనశైలి ఎందరికో ఆదర్శం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.