|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై మూవీ.. పుష్పతో పోల్చొద్దన్న హీరో

Published: 17-11-2025, 4:17 AM
ఎర్రచందనం స్మగ్లింగ్‌పై మూవీ.. పుష్పతో పోల్చొద్దన్న హీరో

మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్న ‘విలాయత్‌ బుద్ధ’ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ చూసి చాలామంది దీనిని ‘పుష్ప’తో పోలుస్తున్నారు. ఈ పోలికలపై స్పందించిన పృథ్వీరాజ్‌, తమ చిత్రం ‘పుష్ప’ కంటే ముందే నవల ఆధారంగా మొదలైందని క్లారిటీ ఇచ్చారు.

Key Points

1

పృథ్వీరాజ్‌ 'విలాయత్‌ బుద్ధ'లో ఎర్రచందనం స్మగ్లర్‌ 'డబుల్‌ మోహన్‌' పాత్రలో నటిస్తున్నాడు.

2

ట్రైలర్‌ విడుదలయ్యాక ఈ చిత్రం అల్లు అర్జున్ 'పుష్ప'తో పోల్చబడుతోంది.

4

దర్శకుడు సాచి కథ చెప్పగా, ఆయన మరణానంతరం అసిస్టెంట్‌ జయన్‌ నంబియార్‌ దర్శకత్వం వహించారు.

పుష్పతో పోలికలు: పృథ్వీరాజ్‌ విలాయత్‌ బుద్ధపై విమర్శలు

మలయాళ హీరో, దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ( Prithviraj Sukumaran ) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “విలాయత్‌ బుద్ధ”. ఈ సినిమాలో హీరో ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే ‘డబుల్‌ మోహన్‌’ పాత్రలో కనిపించనున్నాడు. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. ఇది చూసిన ఎంతోమంది విలాయత్‌ బుద్ధ చిత్రాన్ని పుష్పతో పోలుస్తున్నారు. అల్లు అర్జున్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ పుష్పను కాపీ కొట్టారని విమర్శిస్తున్నారు.

నవల ఆధారంగా.. దీనిపై పృథ్వీరాజ్‌ స్పందించాడు. పుష్ప రాకముందే ఈ సినిమా స్టార్ట్‌ చేశాం. జీఆర్‌ ఇందుగోపాలన్‌ రాసిన విలాయత్‌ బుద్ధ అనే నవల ఆధారంగా మా సినిమా తెరకెక్కింది. అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ డైరెక్టర్‌ సాచి ఫస్ట్‌ నాకు ఈ కథ చెప్పాడు. ఆయన 2020లో కన్నుమూయడంతో తన అసిస్టెంట్‌ జయన్‌ నంబియార్‌ దర్శకత్వ బాధ్యతల్ని భుజాన వేసుకున్నాడు.

పృథ్వీరాజ్‌ వివరణ: నవల ఆధారంగా, పుష్ప కంటే ముందే

పుష్ప కంటే ముందే.. అప్పటికి పుష్ప సినిమా రానేలేదు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఆధారంగా ఒక సినిమా వస్తోందన్న విషయం కూడా మాకు తెలీనే తెలీదు. మా సినిమా చిత్రీకరణ ముగింపుకు వచ్చే సమయానికి పుష్ప రెండు భాగాలు రిలీజై సంచలనం సృష్టించాయి . ఇక మా సినిమాలోని డబుల్‌ మీనన్‌ పాత్రకు పుష్పరాజ్‌ పాత్రకు ఎటువంటి సంబంధం లేదు అని పృథ్వీరాజ్ ‌ క్లారిటీ ఇచ్చాడు.

విలాయత్‌ బుద్ధ కథా నేపథ్యం, టీమ్ వివరాలు

మొత్తానికి, ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం ఉన్నప్పటికీ, ‘విలాయత్‌ బుద్ధ’ ఒక స్వతంత్ర కథాంశమని పృథ్వీరాజ్‌ స్పష్టం చేశారు. ‘పుష్ప’తో పోలికలు సహజమే అయినా, తమ చిత్రం సొంత గుర్తింపుతో వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.