|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రెడ్‌మి నోట్ 17 5G: ఊహించని ఫీచర్లతో వస్తున్న కొత్త ఫోన్! ధర ఎంతంటే?

Published: 08-07-2026, 5:09 AM
రెడ్‌మి నోట్ 17 5G: ఊహించని ఫీచర్లతో వస్తున్న కొత్త ఫోన్! ధర ఎంతంటే?

రెడ్‌మి నోట్ 17 5G త్వరలో మార్కెట్లోకి రానుంది. ఫ్లాగ్‌షిప్-లెవల్ స్పెసిఫికేషన్లు, శక్తివంతమైన క్వాల్‌కామ్ చిప్‌సెట్, 120Hz OLED డిస్‌ప్లే, 50MP కెమెరా వంటి కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ కొత్త 5G ఫోన్ ధర సుమారు రూ. 34,990గా ఉండొచ్చని అంచనా.

Key Points

1

రెడ్‌మి నోట్ 17 5G త్వరలో లాంచ్ కానుంది, ఇది నోట్ 15 5Gకి అప్‌గ్రేడ్ వెర్షన్.

2

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్, 1.5K OLED 120Hz డిస్‌ప్లే ఉండవచ్చు.

4

ఈ 5G ఫోన్ ధర సుమారు రూ. 34,990గా ఉండొచ్చని అంచనా.

కీలక ఫీచర్లు లీక్: ఏమున్నాయో తెలుసా?

Redmi Note 17 5G Leak : కొత్త రెడ్‌మి ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో రెడ్‌మి నోట్ 17 5జీ ఫోన్ వచ్చేస్తోంది. ఈ ఫోన్ రెడ్‌మి నోట్ 15 5జీకి అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ ఫోన్‌లో ఫ్లాగ్‌షిప్-లెవల్ స్పెసిఫికేషన్లు ఉంటాయని అంచనా. పవర్‌ఫుల్ క్వాల్‌కామ్ చిప్‌సెట్‌తో రానుంది.

ఇందులో OLED డిస్‌ప్లే ప్యానెల్ కూడా ఉండొచ్చు. స్మూత్ స్క్రోలింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్ అందించనుంది. రాబోయే ఈ రెడ్‌మి ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరాతో పాటు పూర్తి ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..

కీలక ఫీచర్లు లీక్ : రెడ్‌మి నోట్ 17 5జీ ఫోన్ త్వరలో లాంచ్ కానున్నట్లు సమాచారం. టిప్‌స్టర్ ప్రకారం.. ఈ ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ మోడల్ నంబర్ 2607DRA18T పేరుతో వస్తుంది. ఈ ఫోన్‌లో 2772×1280 పిక్సెల్స్ రిజల్యూషన్ డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్ ఉండొచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండవచ్చు. ఈ కంపెనీ నోవాటెక్ టచ్ డిస్‌ప్లే ఉంటుందని భావిస్తున్నారు.

ప్రాసెసర్, డిస్‌ప్లే వివరాలు

Read Also : Oppo Reno 15 Pro : పండగ చేస్కోండి.. ఈ ఒప్పో ఫోన్ చాలా చీప్ గురూ.. ఏకంగా రూ. 14వేలు తగ్గింపు..!

ప్రాసెసింగ్ కోసం ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్‌, అడ్రెనో 710 జీపీయూను అమర్చనున్నట్లు అంచనా. 6GB ర్యామ్ కూడా ఉంటుందని అంచనా. ఈ ఫోన్‌లో LPDDR4X ర్యామ్ ఉండగా, స్టోరేజ్ UFS 2గా ఉండొచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3.1తో వస్తుందని అంచనా. ధర విషయానికి వస్తే.. ఈ 5జీ ఫోన్ రూ. 34,990 మధ్య ఉండొచ్చు.

కెమెరా, ధరపై అంచనాలు

రెడ్‌మి నోట్ 17 5జీ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుందని అంచనా. బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. జేఎన్ఎస్ సెన్సార్ ఉండొచ్చు. కంపెనీ 8MP అల్ట్రావైడ్ కెమెరా అందించనుంది.

ప్రైమరీ కెమెరాతో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉండొచ్చ. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉండవచ్చు. కంపెనీ ఇంకా ఇతర మెయిన్ స్పెసిఫికేషన్‌లను అధికారికంగా వెల్లడించలేదు.

మొత్తంగా, రెడ్‌మి నోట్ 17 5G అద్భుతమైన ఫీచర్లు, శక్తివంతమైన పనితీరుతో మార్కెట్లోకి రాబోతోంది. లీక్ అయిన వివరాలు చూస్తుంటే, ఇది మిడ్-రేంజ్ విభాగంలో గేమ్-ఛేంజర్ అవుతుందని స్పష్టమవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.