
📌 Key Points
- బిగ్ బాస్ 9 నుంచి రీతూ చౌదరి బయటకు రావడం, ఆమె తల్లి ఇంటర్వ్యూలో పాల్గొనడం.
- రీతూ, డిమోన్ రిలేషన్ గురించి దివ్వెల మాధురి చేసిన ఆరోపణలపై రిపోర్టర్ ప్రశ్న.
- మాధురి చెప్పినవన్నీ అబద్ధాలని, తాను ఎవరికీ ఫోన్ చేయలేదని రీతూ తల్లి ఖండన.
- దివ్వెల మాధురి పరువు తీసిన రీతూ తల్లి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్.
బిగ్ బాస్ 9 రియాలిటీ షో నుండి బయటకు వచ్చాక రీతూ చౌదరి, ఆమె తల్లి ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో, రీతూ తల్లికి ఓ రిపోర్టర్ నుండి దివ్వెల మాధురి చేసిన ఆరోపణలపై ప్రశ్న ఎదురైంది. దానికి రీతూ తల్లి ఇచ్చిన షాకింగ్ సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
రీతూ తల్లికి రిపోర్టర్ షాకింగ్ ప్రశ్న
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-9(Bigg Boss-9). గత వారం అనూహ్యంగా రీతూ చౌదరి(Reethu Chowdary) బయటకు రాగా ఈ వారం పవన్ కళ్యాణ్ తప్ప అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక కొద్ది రోజుల్లో ఫినాలేకు చేరుకోనున్న ఈ షో ప్రజెంట్ రసవత్తరంగా మారింది. అయితే రీతూ చౌదరి బయటికి వచ్చాక వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటుంది.
దివ్వెల మాధురి పరువు తీసిన రీతూ తల్లి
అయితే ఆమెతో పాటు తన తల్లి కూడా వెంటే ఉంటుంది. ఈ క్రమంలోనే రీతూ తల్లికి ఓ రిపోర్టర్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. “రీతూ, డిమోన్ రిలేషన్ బాగాలేదని, మీ అమ్మాయిని అతనితో దూరంగా ఉండమని బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతున్న దివ్వెల మాధురికి మీరు ఫోన్ చేసి చెప్పారా? అంటూ ఓ రిపోర్టర్ రీతూ తల్లిని నేరుగా అడిగాడు.
బిగ్ బాస్ వివాదంపై రీతూ మదర్ క్లారిటీ
దీంతో.. రీతూ తల్లి… మాధురి అన్నీ అబద్ధాలు చెప్పిందని.. తాను ఎవరికీ ఫోన్ చేసి ఎవరితోనూ మాట్లాడొద్దని చెప్పలేదంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లడంపై కూడా సెటైర్లు వేసింది. ఇలా మొత్తానికి అందరి ముందు మాధురి పరువును రీతూ చౌదరి తల్లి తీసేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
రీతూ తల్లి ఇచ్చిన ఈ వివరణతో దివ్వెల మాధురి ఆరోపణలు అవాస్తవమని తేలింది. వైరల్ అవుతున్న ఈ వీడియో బిగ్ బాస్ ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. రీతూ తల్లి తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


