|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిన్న సీన్ కోసం షారుక్ సినిమా రిజెక్ట్ చేశా.. బాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

Published: 06-11-2025, 12:17 PM
చిన్న సీన్ కోసం షారుక్ సినిమా రిజెక్ట్ చేశా.. బాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

బాలీవుడ్ నటి రవీనా టాండన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. షారుక్ ఖాన్ నటించిన ‘డర్’ సినిమాలో స్విమ్‌సూట్ సీన్ ఇష్టం లేక తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని ఆమె వెల్లడించింది. ఈ విషయం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Key Points

1

బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ నాటి సంఘటనలు పంచుకుంది.

2

1993లో షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన 'డర్' చిత్రంలో మొదట రవీనాకే అవకాశం వచ్చింది.

4

చివరకు ఆ పాత్ర జూహీ చావ్లాకు దక్కి, షారుక్-జూహీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది.

రవీనా టాండన్ సంచలన వ్యాఖ్యలు

నేను ఏ నిర్ణయాన్ని అయినా నిర్భయంగా చెప్పే టైప్.. అందుకే స్విమ్‌సూట్ వేసుకోవడం ఇష్టం లేక స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేశానంటూ చెప్పుకొచ్చింది బాలీవుడ్ నటి రవీనా టాండన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తన కెరీర్‌లో ఎదురైన సంఘనటల గురించి అభిమానులతో పంచుకుంది. ‘షారుక్ ఖాన్ హీరోగా 1993లో వచ్చిన ‘డర్’ చిత్రంలో మొదట నాకే అవకాశం వచ్చింది. అయితే అందులో కొన్ని సీన్స్ నాకు అన్‌కంఫర్ట్‌గా అనిపించాయి. అలాగే కాస్ట్యూమ్స్ కూడా నాకు నచ్చలేదు. స్విమ్‌సూట్ ధరించాలని చెప్పారు. అది చాలా చిన్న సీన్ అయినప్పటికీ నాకు నచ్చలేదు. దీంతో ఆ సినిమాను నేను రిజెక్ట్ చేశాను. ఇక ఫైనల్‌గా ఆ పాత్ర జూహీచావ్లాకు వెళ్లింది. ఆ అయితే.. ఆ సినిమాలో షారుక్, జూహీ కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది’ అంటూ చెప్పుకొచ్చింది రవీనా టాండన్.

‘డర్’ సినిమా ఆఫర్ తిరస్కరణకు కారణం

స్విమ్‌సూట్ సీన్‌పై రవీనా అభిప్రాయం

రవీనా టాండన్ నిర్మొహమాటంగా తన నిర్ణయాన్ని పంచుకోవడంతో ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. చివరికి జూహీ చావ్లా చేసిన ఆ పాత్ర సినిమాకు పెద్ద ప్లస్ అయ్యి, ప్రేక్షకుల ఆదరణ పొందింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.