|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rekha – Uday Kiran : నాతో పాటు ఉదయ్ కిరణ్ ఆ సూపర్ హిట్ సినిమా చేయాలి కానీ.. మా ఇద్దరి కాంబోలో రెండు సినిమాలు మిస్..

Published: 26-07-2025, 11:52 PM
Rekha – Uday Kiran : నాతో పాటు ఉదయ్ కిరణ్ ఆ సూపర్ హిట్ సినిమా చేయాలి కానీ.. మా ఇద్దరి కాంబోలో రెండు సినిమాలు మిస్..

ప్రముఖ నటి రేఖ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆమె ఉదయ్ కిరణ్ తో కలిసి నటించాల్సిన రెండు సినిమాలు ఎలా మిస్ అయ్యాయో వివరించింది. ‘ఆనందం’ సినిమాతో మొదలైన ఈ కథనం…

Key Points

1

రేఖ మరియు ఉదయ్ కిరణ్ కలిసి 'ఆనందం' సినిమా చేయాల్సి ఉండేది.

2

లుక్ టెస్ట్ కూడా జరిగింది, కానీ ఉదయ్ కిరణ్ స్థానంలో ఆకాష్ వచ్చాడు.

4

రెండు సినిమాలను మిస్ అయినందుకు రేఖ బాధపడుతోంది.

ఆనందం సినిమాలో రేఖ, ఉదయ్ కిరణ్ కాంబో

Rekha – Uday Kiran : సినీ పరిశ్రమలో ఒకరు చేయాల్సిన సినిమా ఇంకొకరికి పలు కారణాలతో వెళ్లిపోతుంటుంది. ఇది అందరు నటీనటులకు ఏదో ఒక సినిమా విషయంలో జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఆనందం ఫేమ్ రేఖ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఆసక్తికర విషయాలు తెలిపింది.

ఆనందం, ఒకటో నెంబర్ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలతో మెప్పించిన రేఖ వేదవ్యాస్ తర్వాత సినిమాలకు దూరమయింది. ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో కొన్నేళ్లు దూరంగా ఉంది. ఇప్పుడు రేఖ రీ ఎంట్రీ ఇస్తాను అంటూ ముందుకొచ్చింది. ఈ క్రమంలో ఇంటర్వ్యూ ఇచ్చింది.

మిస్ అయిన రెండవ సినిమా అవకాశం

రేఖ ఆవేదన

ఈ ఇంటర్వ్యూలో రేఖ మాట్లాడుతూ.. ఆనందం సినిమా నేను, ఉదయ్ కిరణ్ చేయాలి. లుక్ టెస్ట్ నాకు అతనికి కలిపి చేసారు. నేను ఆ ఒక్కసారే ఉదయ్ కిరణ్ ని కలిసాను. తర్వాత ఏమైందో తెలీదు ఉదయ్ కిరణ్ ప్లేస్ లో ఆకాష్ ని తీసుకున్నారు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ తో కలుసుకోవాలని సినిమా ఛాన్స్ వచ్చింది. కానీ నాకు కన్నడలో సినిమాల వల్ల డేట్స్ కుదరక ఆ ఛాన్స్ వదులుకున్నా. ఆ విషయంలో బాధపడ్డాను, డేట్స్ అడ్జస్ట్ చేసి చేస్తే బాగుండు అనుకున్నాను అని తెలిపింది.

రేఖ తన అనుభవాలను పంచుకుంటూ, ఉదయ్ కిరణ్ తో కలిసి నటించే అవకాశం కోల్పోయినందుకు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ రెండు సినిమాలు వారి కెరీర్ లో మంచి మలుపు తీసుకుని వచ్చేవి కావచ్చు అని ఆమె భావిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.