
📌 Key Points
- గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం విమాన సేవలు పునరుద్ధరణ.
- అబుదాబి నుండి ఢిల్లీ, బెంగళూరుకు చేరిన విమానాలు, దుబాయ్ నుండి బయలుదేరిన విమానం.
- భారతీయుల కోసం 10 రిలీఫ్ విమానాలు నడపనున్నట్లు ఇండిగో ప్రకటన.
- ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భార్య మృతి.
ఇరాన్ దాడుల నేపథ్యంలో నిలిచిపోయిన గల్ఫ్ దేశాల విమాన సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండిగో రిలీఫ్ విమానాలను నడపనుంది.
గల్ఫ్ విమానాశ్రయాల పునఃప్రారంభం
ఇరాన్ దాడుల నేపద్యంలో విమాన సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గల్ఫ్ దేశాలలో ఉన్న విమానాశ్రయాలను పూర్తిగా మూసివేశారు. అయితే సోమవారం సాయంత్రం నుంచి విమాన సేవలు క్రమక్రమంగా పునరుద్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న భారతీయులు తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అబుదాబి నుంచి ఢిల్లీకి, అదే సమయంలో బెంగళూరుకు విమానాలు చేరుకున్నాయి.
దుబాయ్ నుంచి కూడా ఒక విమానం బయలుదేరింది. సాధారణ రోజుల తరహా లాగా కాకుండా కొన్ని కొన్ని విమానాలను పంపిస్తున్నారు. యుద్ధం తీవ్రత కాస్త తగ్గిన నేపథ్యంలో విమానాలు షురూ అయ్యాయి. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, పూర్తిస్థాయిలో విమానాలు పునః ప్రారంభం అవుతాయని అంటున్నారు. ఒకవేళ మళ్లీ యుద్ధం ఉద్రిక్తత ఎక్కువైతే, మళ్లీ విమానాలు ఆగిపోతాయి.
భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు
ఇది ఇలా ఉండగా అక్కడికి గగనతల స్థితిని పర్యవేక్షించనున్నట్లు కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇక లేటెస్ట్ గా భారతీయుల కోసం ఇండిగో, ఏకంగా 10 రిలీఫ్ విమానాలు నడపనున్నట్లు ప్రకటన చేసింది. ఇది ఇలా ఉండగా, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భార్య మృతి చెందారు. ఇటీవల జరిగిన దాడుల్లో ఖమేనీ మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ఆయన భార్య తాజాగా మరణించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించింది ఇరాన్ మీడియా.
ఇరాన్‌లో విషాదం: ఖమేనీ భార్య మృతి
A post shared by Bangalore Trending and Viral Reels By Akshay CN (@bangalore.viral)
యుద్ధ వాతావరణం సద్దుమణగడంతో విమాన సేవలు పునః ప్రారంభం కావడం భారతీయులకు ఊరటనిచ్చే విషయం. పరిస్థితి ఇలాగే కొనసాగితే పూర్తిస్థాయిలో విమానాలు అందుబాటులోకి వస్తాయి.


