|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పర్సులో ఈ 6 వస్తువులు ఉంటే ఆర్థిక ఇబ్బందులు!

Published: 17-09-2025, 9:44 PM
పర్సులో ఈ 6 వస్తువులు ఉంటే ఆర్థిక ఇబ్బందులు!

వాస్తు శాస్త్రం ప్రకారం, పర్సులో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. ఈ వ్యాసంలో పర్సులో ఉంచకూడని ఆరు వస్తువుల గురించి తెలుసుకుందాం. ఇవి తొలగించడం వల్ల ఆర్థిక సమృద్ధి పెరుగుతుంది.

Key Points

1

చిరిగిన నోట్లు, పాత నాణేలు పర్సులో ఉంచకండి.

2

అనవసరమైన బిల్లులు, కాగితాలను తొలగించండి.

4

పర్సులో ఆహారం, పానీయాలు, చెత్త ఉంచకండి.

వాస్తు ప్రకారం పర్సులో ఉండకూడని వస్తువులు

చాలామంది వాస్తు ప్రకారం నియమాలను పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి ప్రవహించేలా ఉంటుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పర్సులో కొన్ని ఉండడం వలన నష్టాలు కలిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంట సానుకూల శక్తి ప్రవహించాలని, ఎలాంటి బాధ లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ చాలామంది చేసే చిన్న చిన్న తప్పులు వలన ఆర్థిక ఇబ్బందులు, పేదరికం, డబ్బు నష్టం కలగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.

పర్సులో కొన్ని వస్తువులను పెట్టడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి. అదే విధంగా పర్సులో కొన్నిటిని పెట్టడం వలన నష్టాలు కలుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా పర్సులో వీటిని ఉంచకండి. మరి వాస్తు ప్రకారం పర్సులో ఏం ఉండకూడదు? ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడే తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం చిరిగిపోయిన నోట్లు, బాగా పాత నాణేలు వంటివి ఉండకూడదు. వీటి వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిని తొలగించండి. ఎప్పటికప్పుడు పర్సును చూసి చిరిగిపోయినవి, పనికిరానివి తొలగించడం మంచిది.

2.అనవసరమైన బిల్లులు, కాగితాలు

ఆర్థిక సమృద్ధి కోసం పర్సు నిర్వహణ

వాస్తు ప్రకారం పర్సులో ఎప్పుడూ కూడా అనవసరమైన కాగితాలు, బిల్లులు వంటివి పెట్టకూడదు. పనైపోయిన వెంటనే వాటిని తొలగించాలి. పనికిరానివి చెత్తబుట్టలో పడేయాలి. లేకపోతే ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు.

చనిపోయిన వారి ఫోటోలను పర్సులో ఉంచుకోవడం మంచిది కాదు. ఇది ఆర్థిక ఇబ్బందులను తీసుకొస్తుంది. ప్రతికూల శక్తిని కూడా కలిగిస్తుంది. కాబట్టి ఇలాంటి ఫోటోలు ఉంటే కూడా తొలగించడం మంచిది.

అనవసరమైన తాళాలను కూడా పర్సులో ఉంచడం మంచిది కాదు. ఇది రాహు కేతువుల ప్రభావాన్ని కలిగిస్తుంది. దాంతో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. డబ్బు కూడా మంచినీళ్లలా కట్ అయిపోతుంది.

5.పానీయాలు, ఆహార పదార్థాలు

లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చిట్కాలు

పర్సులో లేదా హ్యాండ్ బ్యాగులో తినే ఆహార పదార్థాలు, తాగే డ్రింకులు వంటివి ఉండడం మంచిది కాదు. ఇలా ఉన్నట్లయితే లక్ష్మీదేవిని అవమానించినట్లవుతుంది. ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇలాంటి తప్పు కూడా చేయకుండా చూసుకోండి.

పర్సులో జుట్టు, చెత్తాచెదారం వంటి హానికరమైన వస్తువులను తొలగించాలి. లేదంటే లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లవుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పర్సును శుభ్రంగా ఉంచుకోవడం, అనవసరమైన వస్తువులను తొలగించడం వల్ల ఆర్థిక ఇబ్బందులను నివారించవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు పర్సును శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.