|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రముఖ హీరో రాజేష్ మృతి.. సంతాపం తెలిపిన రజనీకాంత్‌

Published: 29-05-2025, 4:25 AM
ప్రముఖ హీరో రాజేష్ మృతి.. సంతాపం తెలిపిన రజనీకాంత్‌

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. 75 ఏళ్ల ప్రముఖ నటుడు రాజేష్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణంపై సూపర్ స్టార్ రజనీకాంత్ సంతాపం తెలిపారు.

Key Points

1

5 దశాబ్దాల పాటు కోలీవుడ్‌లో రాణించిన నటుడు రాజేష్ మృతి.

2

గుండెపోటుతో చెన్నైలో మరణం.

4

రజనీకాంత్ సంతాపం తెలిపారు.

ఐదు దశాబ్దాల సినీ జీవితం

తమిళ చత్రి పరిశ్రమలో విషాదం నెలకొంది. సుమారు ఐదు దశాబ్దాల పాటు కోలీవుడ్‌లో రాణించిన నటుడు రాజేష్‌ (75) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా చెన్నైలో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో చిత్ర పరిశ్రమలోని ఆయన సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఆయన సతీమణి జోన్‌ సిల్వియా గతంలోనే మరణించారు. వారికి దివ్య, దీపక్‌ పిలల్లు ఉన్నారు.

వివిధ భాషల్లో నటన

1974లో  దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘అవల్ ఒరు తొడరకథై’ (అంతులేని కథ) చిత్రంతో ఆయన  సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయనకు వరుస ఛాన్సులు దక్కాయి. తమిళ్‌తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో 150కి పైగా చిత్రాల్లో నటించారు. పోతురాజు, మహానది, సత్య, కన్ని పరువతిలే వంటి సినిమాల్లో నటించారు. ఆయన  హీరో నుండి క్యారెక్టర్ యాక్టర్ వరకు వివిధ పాత్రలు పోషించాడు . 1985లో చెన్నైలోని కె.కె. నగర్ సమీపంలో సినిమా షూటింగ్ కోసం ఒక బంగ్లాను నిర్మించిన తొలి తమిళ నటుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఆ ఇంట్లో అనేక తమిళ, మలయాళ మరియు హిందీ సినిమా షూటింగ్‌లు పూర్తయ్యాయి.

రజనీకాంత్ సంతాప ప్రకటన

సినిమాలతో పాటు ఆయన హోటల్, నిర్మాణ వ్యాపారాన్ని ప్రారంభించాడు. తెలుగులో బంగారు చిలక, చాదస్తపు మొగుడు, మా ఇంటి మహారాజు సినిమాల్లో నటించారు. ఆయన మరణం పట్ల సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సంతాపం తెలిపారు. ఇలాంటి సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్ని ఆ దేవుడు అందించాలని కోరారు. రాజేష్‌తో తనకు ప్రత్యేకమైన అనుభంధం ఉందని గుర్తుచేసుకున్నారు.

తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటుగా రాజేష్ మృతిని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.