
📌 Key Points
- రేణు దేశాయ్ 26 ఏళ్ల తర్వాత మళ్లీ ర్యాంప్ వాక్ చేసింది.
- వాక్‌కు ముందు ఆమె మేకప్ మెన్ గాయపడగా, ఆందోళన చెందింది.
- వ్యక్తిగత బాధను దిగమింగుతూనే ప్రదర్శనను పూర్తి చేసింది.
- సహానూభూతితో ఉండాలని కోరుతూ భావోద్వేగ సందేశం పంచుకుంది.
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకుంది. అయితే, ఈ కార్యక్రమానికి ముందు జరిగిన ఓ ఊహించని ఘటన గురించి ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భావోద్వేగ పోస్ట్ చేసింది. తాను పడిన బాధను పంచుకుంది.
రేణు దేశాయ్ భావోద్వేగ పోస్ట్ కారణం
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) మరోసారి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు రెండేళ్ల విరామం తీసుకున్న తర్వాత ‘పదహారు రోజుల పండుగ’ (padhahaaru rojula pandaga)చిత్రంలో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి కాగా త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇదిలా ఉంటే.. రేణు దేశాయ్ హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫ్యాషన్ షోలోనూ పాల్గొని ర్యాంప్ వాక్ చేసి అందరికీ షాకిచ్చింది. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో హైదరబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా దేశంలోని ప్రముఖ డిజైనర్స్ రూపొందిచిన దుస్తులను మోడల్స్ ర్యాంప్‌పై ప్రదర్శించారు. ఇక ఇందులో.. రేణు దేశాయ్‌తో పాటు అనన్య నాగళ్ల, బిగ్‌బాస్ కౌశల్ మందా, రితికా నాయక్(Ritika Nayak), రుహాణి శర్మ, ఈషా గుప్తా పాల్గొన్నారు.
తాజాగా, రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘‘దాదాపు 26 ఏళ్ల తర్వాత XITI weaves కోసం ర్యాంప్‌పై నడిచేందుకు వేదికపైకి వెళ్లడానికి 10 నిమిషాల ముందు నా పర్సనల్ మేకప్‌మెన్ ఇనుప స్టాండ్ మీది నుంచి జారిపడ్డాడు. బరువైన వస్తువు అతని తలను తాకింది. ఆ క్షణంలో నాకు చుక్కలు కనిపించాయి. అతని పరిస్ధితి తలచుకుని నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అదే సమయంలో షో ప్రారంభం కావడంతో నేను ఏం చేయలేకపోయా, ఆ నొప్పిని, బాధను భరిస్తూనే వాక్ చేయాల్సి వచ్చింది. నా కళ్లను గమనించినట్లయితే కళ్లుగా ఎర్రగా నీటితో నిండి ఉంటాయి.
ర్యాంప్ వాక్‌లో రేణు ఎదుర్కొన్న కష్టం
నేను ప్రస్తుతం చాలా బాధలో ఉన్నాను.. షోలో గందరగోళం లేకుండా ఉండటానికి నా వంతు ప్రయత్నం చేశాను. దీనిని వ్యక్తిగత కారణాల వల్ల పంచుకోవడం లేవు. కొన్నిసార్లు ఒక వ్యక్తి ఎలాంటి బాధను అనుభవిస్తున్నాడో, తన పరిస్ధితిని కొనసాగించడానికి ఎంత కష్టపడుతున్నాడో మనకు తెలియదు. అందుకే తోటివారి పట్ల మరింత దయతో ఉండాలి’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా ర్యాంప్ వాక్ ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా అయ్యో పాపం అంటూనే రేణు దేశాయ్ అందంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
వృత్తి నైపుణ్యంపై నెటిజన్ల ప్రశంసలు
A post shared by renu desai (@renuudesai)
ఈ ఘటన రేణు దేశాయ్ వృత్తి నైపుణ్యాన్ని, మానవత్వాన్ని మరోసారి చాటి చెప్పింది. ఆమె పోస్ట్‌కు నెటిజన్ల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇతరుల పట్ల దయగా ఉండాలన్న ఆమె సందేశం అందరికీ స్ఫూర్తినిస్తోంది.


